మెమోరీస్ ఆఫ్ 'శ్యామ్ సింగ రాయ్‌'

Update: 2021-12-22 09:34 GMT
ఒక సినిమా షూటింగ్ ద‌శ‌లోనే అది ఏ స్థాయిలో చిర‌స్థాయిగా నిలిచిపోనుందో ముందే తెలిసిపోతుంటుంది. అంతే కాకుండా ప్రాణం పెట్టి వ‌ర్క్ చేసిన సినిమా ఫ‌లితాన్ని కూడా ముందు ఊహించేసిన న‌టీన‌టులు, మేక‌ర్స్ ఆ సినిమాకు సంబంధించిన మెమ‌రీస్ ని బ‌ద్రంగా చూసుకుంటుంటారు. అలాంటి సంద‌ర్భాన్నే `శ్యామ్ సింగ రాయ్‌` టీమ్ ఆస్వాదిస్తోంది. ఈ సినిమా షూటంగ్ సంద‌ర్భంగా ఆన్ లొకేష‌న్ లో తీసుకున్న ఫొటోల‌ని తాజాగా మేక‌ర్స్ విడుద‌ల చేశారు. నేచుర‌ల్ స్టార్ నాని ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్ర‌మిది. రాహుల్ సంక్రీత్య‌న్ స‌రికొత్త క‌థ‌తో చేసిన ప్ర‌యోగ‌మే ఈ సినిమా.

వెంక‌ట్ బోయిన‌ప‌ల్లి నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై కేవ‌లం నాని టాలెంట్ పై వున్న న‌మ్మ‌కంతో ధైర్యం చేసి నిర్మించిన చిత్ర‌మిది. యూత్ హార్ట్ త్రోబ్స్ సాయి ప‌ల్ల‌వి, కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్ గా న‌టిచారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో స‌రికొత్త నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 24న ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌ధాన భాగం కోల్‌క‌తా నేప‌థ్యంలో సాగ‌నుంది.

ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభిన‌యం చేసిన విష‌యం తెలిసిందే. ఒక పాత్ర‌లో ఫిల్మ్ మేక‌ర్ వాసుగా, మ‌రో పాత్ర‌లో జ‌ర్న‌లిస్ట్ శ్యామ్ సింగ రాయ్ గా క‌నిపించ‌బోతున్నారు. ఇందులో సాయి ప‌ల్ల‌వి దేవ‌దాసీగా క‌థ‌కు కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించింది. ఆమె పాత్ర సినిమాలో కీల‌కంగా నిలవ‌నుంది. ప్రీ ఇండిపెండెంట్ స‌మ‌యంలో బెంగాళ్ లోని స్త్రీలు దేవ‌దాసీ వ్య‌వ‌స్థ‌ని ఎదుర్కొని దుర్భ‌ర జీవితాన్ని గ‌డిపారు. దీన్ని ప్ర‌శ్నిస్తూనే అత్యాచారాలు, స‌మాజిక దురాచారాల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన ఓ వ్య‌క్తి క‌థ‌ని ఇందులో ప్ర‌ధానంగా చూపించారు.

స‌రికొత్త నేప‌థ్యంలో నానిని కొత్త‌గా ప్ర‌జెంట్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన వ‌ర్కింగ్ స్టిల్స్ ని చిత్ర బృంద తాజాగా విడుద‌ల చేసింది. మెమోరీస్ ఆఫ్ `శ్యామ్ సింగ రాయ్‌`గా ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. బెంగాల్ వాతావ‌ర‌ణం.. 1970లో జ‌రిగే క‌థ కోసం క్యారెక్ట‌ర్ ల‌ని మ‌లిచిన తీరు.. వారి కాస్ట్యూమ్స్ కోసం ద‌ర్శ‌కుడు ప‌డిన క‌ష్టం తాజాగా విడుద‌ల చేసిన ఆన్ లొకేష‌న్ స్టిల్స్ లో క‌నిపిస్తోంది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.


Tags:    

Similar News