ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్.. కుర్ర దర్శకుడు మేర్లపాక గాంధి. మనోడు ''ఎక్స్ ప్రెస్ రాజా'' సినిమాతో ఓ మాంచి హిట్టు కొట్టాడనే టాక్ ఉండనే ఉంది. ఎంచుకుంది రొటీన్ కథనే అయినా కూడా.. కామెడీతో బాగానే నడిపించాడు. సేఫ్ గేమ్ ఆడేశాడు. అయితే ఈ సినిమా హిట్టయితే రామ్ చరణ్ స్వయంగా సినిమా చేస్తాడనే టాక్ ఉంది. ఈ విషయం గురించి గాంధిని అడిగితే ఏమన్నాడో తెలుసా??
ఒక ఇంటర్యూలో భాగంగా రామ్ చరణ్ సినిమా గురించి అడిగితే.. అసలు ఇంతవరకు తన మూడో సినిమా కోసం ఒక్క కథను కూడా తయారు చేసుకోలేదని.. కనీసం ఒక లైన్ కూడా అనుకోలేదని చెప్పాడు గాంధి. ''నేను ఇప్పటివరకు రామ్ చరణ్ గారిని కలవలేదు. ఆయనకు ఎటువంటి కథను చెప్పలేదు. అలాగే ఆయన కోసం ఏ కథను తయారు చేయలేదు. కేవలం ఆయన ఎక్స్ ప్రెస్ రాజా సినిమా పాటలను చూసి.. శర్వానంద్ గారికి వాటి గురించి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఇంకా ఆయన సినిమాను చూడలేదు. మీరు వింటున్నవన్నీ ఊహాగానాలే'' అన్నాడు గాంధి.
అంతే కాదు.. మనోడు సుశాంత్ ను డైరక్ట్ చేయాల్సి ఉందట. అన్నపూర్ణా స్టూడియోస్ కు ఇచ్చిన కమిట్ మెంట్ గురించి మాట్లాడమంటే.. వదిలేయండి.. అనేశాడు కాని.. అదేదో మనోడ్ని చిక్కుల్లో పడేసిందని తెలుస్తోంది.