టాలీవుడ్ లో ఇప్పుడు మినిమం గ్యారెంటీ డైరెక్టర్ల సంఖ్య పెరుగుతోంది. ఒకానొక టైంలో ముఖ్యంగా రాజమౌళి, వినాయక్ కేరీర్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఏ డైరెక్టర్ అయినా ఒక హిట్ ఇస్తే రెండు నుంచి మూడు ప్లాపులు అన్నట్టుగా సినిమాలు తీసేవారు. అయితే 2001-02 ఈయర్ లోనే ఆదితో వినాయక్, స్టూడెంట్ నెంబర్ 1తో రాజమౌళి, నువ్వు నువ్వే తో త్రివిక్రమ్ డైరెక్టర్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు అతనొక్కడే లాంటి హిట్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన సురేందర్ రెడ్డి, ఆర్యతో గ్రాండ్ గా లాంఛ్ అయిన సుకుమార్, మిర్చి ఫేం కొరటాల శివ ఇప్పుడు వీరంతా తమకంటూ ఓ క్రేజ్ ఏర్పరుచుకున్నారు.
ఈ డైరెక్టర్లు ఏ హీరోతో సినిమా తీస్తున్నా మంచి అంచనాలే ఉంటాయి. జనాల్లో సినిమా చూడాలన్న ఉత్సుకత కూడా నెలకొంటుంది. ఈ జాబితాలో చూసుకుంటే అపజయమేలేని డైరెక్టర్ రాజమౌళి. రాజమౌళి సినిమా అంటేనే ప్రేక్షకులు పూనకంతో ఎలా ఊగిపోతున్నారో బాహుబలి చెప్పకనే చెప్పింది. ఇప్పుడు జక్కన్న క్రేజ్ ఎలా ఉందంటే ఆయన వద్దకే హీరోలు వచ్చి సినిమాలు తీయమని అడిగే స్థాయిలో ఉంది. రాజమౌళి సినిమా అంటే చూసుకోవక్కర్లేదు..ఎంతైనా ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది రెఢీగా ఉన్నారు.
వివి.వినాయక విషయానికి వస్తే పాత ఆవకాయపచ్చడి లాంటి స్టోరీ ఇచ్చినా ఏదోలా హంగులద్ది కమర్షియల్ హిట్ చేసేస్తాడు. కొత్త హీరోలతో కూడా వినాయక్ సినిమాలు తీస్తున్నాడంటే భారీ అంచనాలే ఉన్నాయి. ఒకటి రెండు ప్లాపులున్నా వినాయక్ మూవీ అంటే ఇటు ప్రేక్షకులతో పాటు అటు బయ్యర్లలో ఆసక్తి ఉంటుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ హిట్ అన్నట్టుగా ఉంది. అత్తారింటికి దారేదితో ఇండస్ర్టీ మర్చిపోలేని హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ సత్యమూర్తి అంచనాలను అందుకోలేకపోయినా ఆ సినిమాకు వచ్చిన హైప్ ఎలా ఉందో చూస్తేనే అర్థమవుతోంది. సత్యమూర్తి యావరేజ్ టాక్ తోనే రూ.50 కోట్ల మార్క్ ను సులువుగానే క్రాస్ చేసింది. కుర్ర హీరో నితిన్ త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాకు రూ.13 కోట్లు పారితోషకం ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయంటే త్రివిక్రమ్ పై హీరోలకు ఉన్న అంచనా తెలుస్తోంది.
పై డైరెక్టర్లతో పోల్చలేకయినా సురేందర్ రెడ్డి సినిమాపై కూడా అంచనాలే ఉంటాయి. ఎన్టీఆర్ తో రెండు, మహేష్ తో ఒక ఛాన్స్ వచ్చినా ఇవి ఉపయోగించుకోలేకపోవడం ఆయన కేరీర్ పీక్ స్టేజ్ కు వెళ్లడంలో లేట్ అయ్యింది. రేసుగుర్రంతో దూసుకొచ్చిన సూరి తాజా మూవీ కిక్-2పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సినిమా అన్నా ఏదో కొత్తగా ట్రై చేస్తాడన్న ఆశ అటు హీరోల నుంచి ఇటు కామన్ ప్రేక్షకుడి వరకు ఉంటుంది.ఇదే కోవలో పూరి, శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల ఉన్నా వీరిని చాలాసార్లు నమ్మలేని పరిస్థితి ఉంది. తాజాగా టాలీవుడ్‌లో హీరోల నుంచి ప్రేక్షకుడి వరకు సినిమా హిట్ అన్న కాన్ఫిడెంట్ వచ్చే డైరెక్టర్ల జాబితాలో కొరటాల శివ చేరాడు. మిర్చి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శివ శ్రీమంతుడు ఎలా ఉంటుందో అన్న సస్పెన్స్ చాలా మందిలో ఉంది. అయితే సోషల్ మెసేజ్ స్టోరీ ని బలమైన కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పి అందరి మైండ్ బ్లోయింగ్ చేశాడు. ఇప్పుడు కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు రెఢీ అవుతున్నాడు.
ప్రభాస్, మహేష్ తో వచ్చిన రెండు ఛాన్సులను చక్కగా సద్వినియోగించుకుని మరో స్టార్ హీరో తో సినిమాకు రెఢీ అయిపోయాడు. మన తెలుగులో చాలా మంది పెద్ద నిర్మాతలు ఎందరో డైరెక్టర్ల ను నమ్ముకుని భారీగా ఖర్చు చేసి కుదేలయ్యారు. అగ్ర నిర్మాతలైతే ఇండస్ర్టీకి దూరమయ్యారు. ఈ టైంలో సినిమా అంటే హిట్ అన్న భరోసా ఇచ్చే డైరెక్టర్ల సంఖ్య పెరగడం టాలీవుడ్ కు శుభసూచకం.