మన అందం మరోసారి అంతర్జాతీయంగా మెరిసింది. తెలంగాణరాష్ట్రంలోని హైదరాబాద్ శివారులో ఉండే పటాన్ చెరు మండలంలోని రుద్రారం గ్రామంలో ఉన్న గీతం హైదరాబాద్ క్యాంపస్ కు చెందిన విద్యార్థిని జొన్నలగడ్డ మానస ఇప్పుడు మిస్ ఇండియా ఏసియా పసిఫిక్ గా నిలిచిన వైనం ఆసక్తికరంగా మారింది.
గీతం క్యాంపస్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో థర్డ్ ఇయర్ చదువుతున్న ఆమె.. తాజాగా జరిగిన అందాల పోటీలో విజయం సాధించారు. ఇటీవల థాయ్ లాండ్ లోని పట్టాయలో జరిగిన పోటీల్లో పాల్గొన్న మానస మిస్ ఇండియా ఏసియా పసిఫిక్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఆమె టైటిల్ సొంతం చేసుకోవటంపై గీతం వర్సిటీ.. అక్కడి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మన దేశంతో పాటు దుబాయ్.. సింగపూర్.. మలేషియా.. థాయిలాండ్.. శ్రీలంకకు చెందిన పలువురు ఈ టైటిల్ కోసం పోటీ పడ్డారు. చివరకూ మనమ్మాయ్ మానస టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.