మహానటి లో మిస్టేక్.. కానీ..

Update: 2018-05-12 03:39 GMT
మహానటి.. మహానటి.. ఎక్కడ చూసినా ఇదే పేరు. సరిగ్గా 1950లలో ఇలాగే సావిత్రమ్మా..సావిత్రమ్మా.. అంటూ ఆమె అభిమానులు ఎంతగానో జేజేలు కొట్టారు. మంచి నటనతో మంచితనం కూడా ఆమెకు పుట్టుకతోనే వచ్చిందేమో.. అందుకే నిజ జీవితంలో నటించే వారిని గమనించ లేదు. ఆ దెబ్బ ఆమెకు చాలా గట్టిగానే తగిలింది. ఇక మహానటి సినిమా విషయానికి వస్తే.. సినిమా అందరి హృదయాలను చాలా గట్టిగా తాకిందనే చెప్పాలి. అయితే సినిమాలో ఒక పొరపాటు అందరిని షాక్ కి గురి చేసింది. పదండి ఏంటో చూద్దాం.

మోహన్ బాబు ఎస్వీ రంగారావు గారి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో ఆయనకు సావిత్రి పాత్రకు సంబంధించిన ఒక సన్నివేశం పొరపాటు అని తేలింది. నిజానికి సావిత్రి కొంచెం డౌన్ అయ్యాక సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ జీవితాన్ని గడిపారు. గోరింటాకు సినిమా షూటింగ్ లో ఆమె అటు వైపుగా వెళుతుండగా ఎస్వీఆర్ పాత్ర(మోహన్ బాబు) ఆమెతో మాట్లాడతారు. ఆమెని ప్రొడక్షన్ టీమ్ పట్టించుకోకుండా ఉండడం.. కనీసం ప్రత్యేక లంచ్ ఏర్పాటు చేయకపోవడం ఎస్వీఆర్ కి నచ్చదు. వెంటనే ప్రొడక్షన్ మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి తన లంచ్ ని తెప్పించి స్వయంగా ఆమెకు వడ్డిస్తారు. ఆ సీన్ సినిమాలో హైలెట్ గా నిలిచింది. అందుకేనేమో చాలా మందికి అన్వేషణ కూడా మొదలైంది.

అసలు గోరింటాకు సినిమా చిత్రీకరణ సమయంలో ఎస్వీ రంగారావు గారు బ్రతికి లేరు. 1979లో ఆ సినిమాను చిత్రీకరించారు. అయితే 1974లోనే ఎస్వీఆర్ కాలం చేశారు. ఇదే అతిపెద్ద మిస్టేక్ అని అందరు చర్చించుకోవడం మొదలు పెట్టగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిసే ఆ సీన్ షూట్ చేసినట్లు చెప్పాడు. నిజంగా గోరింటాకు సినిమా షూటింగ్ సమయం లోనే సావిత్రి గారికి అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పట్లో గుమ్మడి గారు ఒక్కరే ఉన్నారు. కానీ ఆయన పాత్రను మేము రెడీ చేసుకోలేదు. కేవీ రెడ్డి చక్రపాణి వంటి వారు కూడా ముందే మరణించారు. అందులో అప్పటికే సినిమాలో ఎస్టాబ్లిష్ చేయబడిన ఎస్వీఆర్ పాత్ర అయితే బెటర్ గా ఉంటుందని భావించి జీవితం తాలూకు భావాన్ని చెప్పడానికి అక్కడ అలా షూట్ చేశామని నాగ్ అశ్విన్ వివరించాడు.

ఏదేమైనా ఆ సీన్ అద్భుతంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా మోహన్ బాబు చెప్పిన డైలాగ్ అందరిని కదిలించింది. "అన్నం పెట్టే వాడి ఉంగరాళను కూడా కొట్టేయ్యాలని చూసే సమాజం అమ్మా ఇది" అంటూ చెప్పిన డైలాగ్ సావిత్రి ఓ జీవిత కోణాన్ని మనస్సులో ఇమిడిపోయేందుకు ఆ మాట కూడా సాయం చేసిందనే చెప్పాలి.
Tags:    

Similar News