పైమా అవార్డుల్లో ఇదేం విడ్డూరం?

Update: 2017-06-14 13:17 GMT
జాతీయ అవార్డులు - నంది అవార్డుల్లాంటి వాటితో పోలిస్తే.. సైమా అవార్డులు - ఐఫా అవార్డుల్ని జనాలు అంత సీరియస్‌ గా తీసుకోరు. వీటి నిర్వాహకులు కూడా కమర్షియల్ కోణంలో ఈ అవార్డులిస్తారు తప్ప వాళ్లలోనూ అంత సీరియస్‌నెస్ కనిపించదు. అంత మాత్రాన అవార్డుల నామినేషన్లలో సిల్లీ తప్పులు చేస్తే జనాలకు వీటి మీద ఆసక్తి పోవడం ఖాయం.

సైమా అవార్డుల నామినేషన్లు చూస్తే.. అందులో చోటు చేసుకున్న రెండు తప్పిదాలు చూస్తే, తెలుగు సినిమాల పట్ల వీళ్ల అవగాహన మీద సందేహాలు రేకెత్తడం ఖాయం. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డుకు గాను ‘సిద్దార్థ’ సినిమా దర్శకుడు దయానందరెడ్డికి నామినేషన్ ఇచ్చారు. కానీ దయానందరెడ్డికి ఇది తొలి సినిమా కాదు. అంతకుముందే అతను ‘అలియాస్ జానకి’ అనే సినిమా తీశాడు. ఆ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా దయా నంది అవార్డు కూడా అందుకోవడం విశేషం.

ఇక ఈ సినిమా హీరో సాగర్‌ కు సైతం బెస్ట్ డెబ్యూ యాక్టర్ నామినేషన్ ఇచ్చారు. అతడికి కూడా ‘సిద్దార్థ’ తొలి సినిమా కాదు. అతను హీరోగా దీని కంటే ముందు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అనే వచ్చింది. అంతకంటే ముందు ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో క్యారెక్టర్ రోల్ చేశాడు సాగర్. మరి ఈ మాత్రం అవగాహన లేకుండా సైమా అవార్డుల నిర్వాహకులు నామినేషన్లు జనాలకు ఈ అవార్డులపై ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో చెప్పేదేముంది?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News