ఎమెల్యే కు గోల్డెన్ ఛాన్స్

Update: 2018-03-20 09:50 GMT
కళ్యాణ్ రామ్ ఎమెల్యే ఈ శుక్రవారమే థియేటర్లలో అడుగు పెట్టనుంది. పోటీ మరీ విపరీతంగా ఏమి లేదు కాని కంటెంట్ తో ఓ మాదిరిగా మెప్పించినా చాలు ఈజీగా పాసైపోయే ఛాన్స్ ఉంది. నిజానికి ఈ సంవత్సరం మాస్ కోసం పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అయిన సినిమా ఇప్పటి దాకా రాలేదు. సంక్రాంతికి వచ్చిన వాటిలో హాలిడే సీజన్ పుణ్యమా అని జైసింహ ఓ మాదిరిగా ఓకే అనిపించుకుంది కాని బాలయ్య రేంజ్ సక్సెస్ అయితే కాదు. ఆ తర్వాత భాగమతి హిట్ కొట్టింది కాని హారర్ జానర్ కావడం వల్ల రీచ్ పరిమితమయ్యింది. వరుణ్ తేజ్ తొలిప్రేమతో ఇండస్ట్రీకి హిట్ ఇచ్చాడు కాని అది యూత్ టార్గెట్ లవ్ స్టొరీ కనక మాస్ కు చేరలేదు. ఈ నేపధ్యంలో కళ్యాణ్ రామ్ కు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. పటాస్ తరహాలో అన్ని రకాల మసాలాలు దట్టంగా మిక్స్ చేసి డెబ్యు డైరెక్టర్ ఉపేంద్ర మాధవ్ దీన్ని పక్కా ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది.

నందమూరి హీరో నటించిన రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా కావడం ట్రైలర్ లో అన్నిమసాలాలు ఉన్నాయే అనే ఫీలింగ్ వచ్చేలా చేయటం పాజిటివ్ గానే వర్క్ అవుట్ అవుతున్నాయి. కాజల్ గ్లామర్ ప్లస్ కానుండగా మణిశర్మ మ్యూజిక్ కూడా మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకోవడం హైప్ ని పెంచింది. కొత్తగా విడుదల చేసిన మేకింగ్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. రేస్ గుర్రం తర్వాత విలన్ రవి కిషన్ మరోసారి ఇందులో దానికి ధీటైన పాత్రను దక్కించుకున్నట్టు ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. ఎమెల్యేకు పోటీగా ఉన్న రాజరధం కన్నడ డబ్బింగ్ కావడం వల్ల దాని ప్రభావం ఉంటుందని అనుకోవడానికి లేదు. దర్శకుడు ఉపేంద్ర మాధవ్ గతంలో శీను వైట్ల దగ్గర దూకుడు, బాద్షా లాంటి సినిమాలకు పనిచేసిన అనుభవం ఉంది. అది ఇప్పుడు ఎమెల్యే కోసం రంగరిస్తున్నట్టు కనిపిస్తోంది. కంటెంట్ తో కొట్టాడా ఎమెల్యే భారీ మెజారిటీ తో గెలవచ్చు.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News