మలయాళ నటి భావన కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. భావన కిడ్నాప్ లో కీలక పాత్ర పోషించిన పల్సర్ సునీ పోలీసులకు దొరికినప్పటికీ తెరవెనుక వ్యక్తులెవ్వరన్నది ఇంకా బయటికి రాలేదు. మరోవైపు పోలీసులు ఈ కేసులో కీలక సాక్ష్యమవుతుందని భావిస్తున్న మొబైల్ ఫోన్ కోసం వేట సాగిస్తున్నారు. భావనను కార్లో కిడ్నాప్ చేసిన పల్సర్ సునీ బృందం.. ఆమెను వివస్త్రను చేసి ఫొటోలు.. వీడియోలు తీసినట్లుగా చెబుతున్న సంగతి తెలిసిందే. భావన కంప్లైంట్లో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఐతే ఇప్పుడు ఆ మొబైల్ ఏమైందన్నదే తెలియట్లేదు.
తాను ఆ మొబైల్ ను వెన్నెల బైపాస్ దగ్గర గాష్రీ అనే బ్రిడ్ల్ కింద కాలువలోకి విసిరేసినట్లుగా సునీ పోలీసులకు చెప్పాడు. కానీ నిందితుడిని తీసుకెళ్లి వెతికి చూడగా మొబైల్ ఆ పరిసర ప్రాంతాల్లో దొరకలేదు. దీంతో సునీ అబద్ధం చెబుతున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మొబైల్ సునీ పోలీసులకు లొంగిపోయే ముందు తలదాచుకున్న చార్లీ ఇంట్లో ఉండొచ్చని భావిస్తున్నారు. సునీ అరెస్టయినప్పటి నుంచి చార్లీ కనిపించట్లేదు. మరోవైపు సునీ వాడుతున్న పల్సర్ బైకును కోర్టులో సరెండర్ చేశారు. ఆ బైక్ చార్లీ మిత్రుడైన ఆంటోనీదని తేలింది. దీనిపై అతడిని ప్రశ్నించగా.. గత వారం సునీ తన బైకును దొంగిలించాడని చెప్పాడు. మరోవైపు ఈ కేసులో తెరవెనుక ఉండి నడిపిస్తున్నది తానేనంటూ వస్తున్న ఆరోపణల్ని ఖండించిన సీనియర్ నటుడు దిలీప్.. తనపై ఈ దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దానిపై విచారణ జరుగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/