తెలుగు తెరపై విభిన్నమైన కథలలో .. విలక్షణమైన పాత్రలను పోషించిన మోహన్ బాబు, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. డైలాగ్ డెలివరీతో 'ఔరా' అనిపించారు. కెరియర్ తొలినాళ్లలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను ఎక్కువగా చేస్తూ .. విలనిజానికి కామెడీ కోటింగ్ ఇస్తూ ఆయన ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తరువాత హీరోగా కూడా ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసి, ఎన్నో భారీ సినిమాలను నిర్మించారు. నిర్మాతగాను సక్సెస్ అనిపించుకున్నారు.
నటుడిగా 500 సినిమాలకు పైగా చేసిన ఆయన, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకి సంబంధించిన అనేక విషయాలను ఆయన అభిమానులతో పంచుకున్నారు. "నేను పుట్టిపెరిగింది చిత్తూరు జిల్లా 'మోదుగులపాలెం'లో. నా అసలు పేరు భక్తవత్సలం నాయుడు .. 'స్వర్గం నరకం' సినిమా షూటింగు కోసం విజయవాడ వెళ్లాను. ' మోహన్ బాబు .. ఇలా రావయ్యా' అని దాసరి నారాయణరావు గారు పిలిచారు. ఆయన ఎవరిని పిలుస్తున్నారా అని నేను చుట్టూ చూశాను. "నిన్నేనయ్యా .. ఇక నుంచి నీ పేరు మోహన్ బాబు" అన్నారు.
ఆ తరువాత దుర్గమ్మ గుడికి వెళ్లి 'అమ్మా ఇక నా పేరు మోహన్ బాబు అట' అని అమ్మతో చెప్పాను. ఆ సమయంలో నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి. అలా మోహన్ బాబుగా .. నటుడిగా నా ప్రయాణం మొదలైంది. అన్నగారు చేసిన 'రాజమకుటం' చూసిన తరువాత నటుడిని కావాలనే కోరిక నాలో కలిగింది. అయితే మొదటి నుంచి కూడా విలన్ గా చేయాలనే కోరిక ఉండేది. ఆ కోరికతో చెన్నై వెళ్లిన నేను ఒక స్కూల్లో 'డ్రిల్ మాస్టర్' గా చేరాను. నెలకి 140 రూపాయలు ఇచ్చేవారు. ఆ తరువాత నా కులం వేరని చెప్పేసి నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు. అందుకే నా స్కూల్ కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లో 'కులం' అనే కాలం లేకుండా చేశాను.
ఉద్యోగం పోయింది .. ఏం చేయాలో తెలియదు. ఎక్కడైనా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరితే పొట్ట గడుస్తుంది .. సినిమా వేషాల కోసం ట్రై చేయవచ్చనే ఉద్దేశంతో ఆ వైపు వెళ్లాను. అసిస్టెంట్ డైరెక్టర్ గా నాకు అవకాశం ఇప్పించింది ప్రభాకర్ రెడ్డిగారు. ఆ తరువాత అసోసియేట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు కృష్ణగారిని కూడా వేషాలు అడిగేవాడిని. అప్పుడు ఆయన చెప్పడంతో 'అల్లూరి సీతారామరాజు' సినిమాలో సీతకి భర్త పాత్రను ఇచ్చారు. అది చాలా చిన్న పాత్రే అయినా చేశాను. ఆ తరువాత 'కన్నవారి కలలు' సినిమాలో విలన్ పాత్రను పోషించాను.
అసిస్టెంట్ఆ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు 6 నెలలు పనిచేయించుకుని జీతంగా 50 రూపాయలు ఇచ్చినవారు ఉన్నారు. అడిగితే అవమానకరంగా మాట్లాడినవారు ఉన్నారు. ఇప్పుడు వాళ్లను తక్కువ చేసి మాట్లాడటం నా స్వభావం కాదు. అప్పుడు వాళ్లున్న పరిస్థితి అది అనుకున్నాను. ఏ ప్రభాకర్ రెడ్డిగారు నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇప్పించారో .. అదే ప్రభాకర్ రెడ్డిగారు నన్ను హీరోగా పెట్టి 'గృహప్రవేశం' సినిమా చేస్తే 25వారాలు ఆడింది. 'గృహ ప్రవేశం' సినిమా కోసం ఏసుదాసుగారు 'దారిచూపిన దేవత ..'అనే పాట పాడారు. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది.
అప్పటి నుంచి నా ప్రతి సినిమాలోనూ ఆయనతో పాడించాను. నా వాయిస్ కి ఆయన వాయిస్ సెట్ కావడం ఒక కారణమైతే, నా సినిమాలకి ఆయన పాడిన ప్రతి పాట హిట్ కావడం మరో కారణం. ఇక బాలు గారు .. నేను ఒకే స్కూల్లో చదువుకున్నాము. నేను ఎక్కడ కనిపించినా నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఎప్పుడూ ఎంతో సరదాగా మాట్లాడుతూ ఉండేవారు. తాను లేకపోవడం భారత దేశానికి ఒక తీరని లోటు" అని చెప్పుకొచ్చారు.