దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. విలన్‌గా మొదలైన ఆయన నట ప్రస్థానం ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఇలా పలు రకాలుగా కొనసాగింది. ఈ క్రమంలోనే సుదీర్ఘ ప్రయాణంలో ఆయన దాదాపు 500లకు పైగానే చిత్రాల్లో నటించారు. అయితే, కొంత కాలంగా సినిమా వేగం తగ్గించారు.
ఈ మధ్య కాలంలో పెద్దగా లీడ్ రోల్‌తో సినిమాలు చేయని మోహన్ బాబు.. గత ఏడాది 'సన్ ఆఫ్ ఇండియా' అనే చిత్రంతో వచ్చారు. కానీ, దీనికి ఆశించిన రీతిలో ప్రేక్షకుల నుంచి స్పందన రాలేదు. ఫలితంగా ఈ మూవీ అతి తక్కువ వసూళ్లతో డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో దీని తర్వాత మోహన్ బాబు మళ్లీ గ్యాప్ తీసుకున్నారు. దీనిపై ఆయన ఫ్యాన్స్ నిరాశగా ఉండిపోయారు.
మనోజ్ వివాహం తర్వాత బయట ఎక్కడా కనిపించని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. తాజాగా తిరుపతిలో కనిపించారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ముందుగా తిరుమలలో గతంలో కంటే ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. తర్వాత సినిమాలపైనా కూడా మాట్లాడారు.
తిరుమలలో దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు త్వరలోనే భారీ ప్రాజెక్టును చేస్తున్నట్లు వెల్లడించారు. 'మేము త్వరలోనే వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఓ భారీ సినిమాను చేయబోతున్నాం. దీనికి సంబంధించిన వివరాలు అన్నీ విష్ణు బాబు త్వరలోనే వెల్లడిస్తాడు' అని చెప్పారు. దీంతో ఇప్పుడిది టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. మోహన్ బాబు ప్రకటించిన వంద కోట్ల రూపాయల సినిమా చదువు గురించి ఇచ్చే ఓ మెసేజ్‌తో రాబోతుందట.
ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్శిటీ ఏర్పాటును ప్రస్తావిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో హీరోగా ఎవరు చేస్తారన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మొత్తానికి మోహన్ బాబు గట్టి ప్లాన్‌లోనే ఉన్నారని అర్థం అవుతోంది.