ఓటీటీ రిలీజ్ లు ఇకపై రీలోడెడ్ రీమేక్ లానే ఉంటాయా?
థియేట్రికల్ గా సక్సెస్ అయిన కంటెంట్ కి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది.
థియేట్రికల్ రిలీజ్- ఓటీటీ రిలీజ్ భవిష్యత్ లో సపరేట్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఉందనే విశ్లేషకులు భావిస్తు న్నారు. ఇప్పటికే ఓటీటీ రిలీజ్ లో అదనంగా కొన్ని సన్నివేశాలు కలిపి రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ ప్రింట్ లో రెండున్నర ..మూడు గంటలుంటే? ఓటీటీలో మరికొన్ని సన్నివేశాలు కలిపి అదనమైన నిడివితో రిలీజ్ చేస్తున్నారు. థియేట్రికల్ గా సక్సెస్ అయిన కంటెంట్ కి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఒకవేళ థియేట్రికల్ గా ఫెయిలైనా ఓటీటీలో యావరేజ్ గా రాణిస్తున్నాయి. ఇప్పటికే అడిషనల్ కంటెంట్ తో ఓటీటీలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓటీటీ కట్స్ అంటూ రిలీజ్ చేస్తున్నారు. 'లియో', 'పుష్ప-2' సహా చాలా చిత్రాలు అలా రిలీజ్ అయినవే. అయితే భవిష్యత్ లో అదే టైటిల్ తో థియేట్రికల్ రిలీజ్ తో సంబంధం లేకుండా ఓటీటీలో ప్రత్యేక కంటెంట్ ను రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది.
ఇప్పటి వరకూ ఓటీటీలో అదనంగా సన్నివేశాలు యాడ్ చేయడం మాత్రమే జరిగింది. అయితే రానున్న రోజుల్లో అదే కథకు సన్నివేశాలను యాడ్ చేయడంతో పాటు కొత్త సన్నివేశాలు చిత్రీకరించి యాడ్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. దర్శక, రచయితలు బెస్ట్ ఇవ్వడం కోసం చాలా వెర్షన్లు రాస్తారు. వాటిలో ది బెస్ట్ ని థియేట్రికల్ గా ఎంపిక చేస్తారు. మిగతాది రఫ్ పుటేజ్ గా మిగిలిపోతుతుంది.
అయితే అందులో సన్నివేశాలను తీసుకుని ఓటీటీ రిలీజ్ కి యాడ్ చేస్తే అదే సినిమా ఓ రీమేక్ లా మారుతుందనే అభిప్రాయాన్ని ఓ స్టార్ డైరెక్టర్ పంచుకున్నాడు. అయితే ఆ పని షూటింగ్ దశలోనే రెండు వెర్షన్లు షూట్ చేస్తే నిర్మాతకు భారం తగ్గుతుంది. అదనంగా సమయం పట్టినా? ఓటీటీ బిజినెస్ లో కలిసొస్తుందని అంటున్నారు. దీంతో ఓటీటీకి ఫ్రెష్ కంటెంట్ ఇచ్చినట్లు అవుతుందంటున్నారు.
అదే కంటెంట్ తో థియేట్రికల్ రిలీజ్ తో సంబంధం లేకుండా ఓటీటీ తో ప్రత్యేక బిజినెస్ చేయోచ్చని అభిప్రా యపడ్డారు. అలా చేయగల్గితే థియేట్రికల్ రిలీజ్ పై ఓటీటీ అజమాయిషీ కూడా తగ్గుందని అంటున్నారు. ఐడియా అయితే బాగుంది. కానీ ఇదెక్కడా కంటెంట్ కి నాన్ సింక్ గా ఉండకూడదు. అప్పుడే సాధ్యమవుతుంది. బ్యాకెండ్ కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది.