మోహన్‌బాబు అల్లరోడికి మామ వరస!

Update: 2015-07-01 07:15 GMT
ఇది నిజంగానే అరుదైన కలయిక. ఒక సీరియస్‌ స్టార్‌, ఒక అల్లరోడు .. ఈ ఇద్దరూ మామా అల్లుళ్లుగా నటిస్తే .. చూసే ప్రేక్షకుడికి భలే మ్యాజిక్కు అనిపిస్తుంది. జిమ్మిక్కు చేశారనిపిస్తుంది. మొత్తానికి షోని సూపర్‌హిట్‌ చేయడానికి భలే ఐడియాతో వచ్చారే అనిపిస్తుంది. మంచు హీరో, నిర్మాత మోహన్‌బాబు ఆలోచనతోనే ఇది సాధ్యమైంది. ఇటీవలే ఓ ఇంటివాడైన అల్లరి నరేష్‌కి మోహన్‌బాబు ఆన్‌స్క్రీన్‌ మామ అవ్వడం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ.

    మంచు మోహన్‌బాబు భారీ ప్రణాళికతో రెడీగా ఉన్నారు. అతడు ఓ పూర్తి స్థాయి హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందుకోసం ఓ మరాఠీ సినిమా రీమేక్‌ హక్కుల్ని చేజిక్కించుకుని డమరుకం ఫేం, దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డిని రంగంలోకి దించారు. రెడ్డి గత కొంతకాలంగా మోహన్‌బాబుతో కథా చర్చలు సాగించారు. చివరికి కాస్టింగ్‌లో అల్లరి నరేష్‌ ఉంటే బావుంటుందని భావించారిద్దరూ. అంతే వెంటనే నరేష్‌కి పిలుపు వెళ్లింది. అంతేకాదు.. సిమ్రన్‌, రమ్యకృష్ణ, నదియా లాంటి మేటి నటీమణులకు మోహన్‌బాబు సరసన అవకాశం దక్కింది. కథలో మామా అల్లుళ్ల మధ్య బోలెడంత కామెడీకి, సెంటిమెంటుకు ఆస్కారం ఉంది. అందుకే నరేష్‌ని ఎంపిక చేసుకున్నారు.

    ఇటీవలి కాలంలో నరేష్‌కి సోలో ట్రయల్స్‌ అస్సలు వర్కవుటవ్వడం లేదు. ఇలా ఓ మల్టీస్టారర్‌ అయితే తనకి ప్లస్‌ అవుతుందని భావించాడు. పైగా మోహన్‌బాబు అంతటి క్రమశిక్షణ ఉన్న నటుడి నుంచి పిలుపొచ్చాక కాదనలేని పరిస్థితి. ఏదేమైనా ఈ కలయిక టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యిందిప్పుడు. క్రమశిక్షణ ఉన్న మామ, అసలే క్రమశిక్షణా లేని అల్లుడు మధ్య సాగే సీరియస్‌ డ్రామా నుంచి కామెడీ పుట్టిస్తారేమో చూడాలి.

Tags:    

Similar News