అంతిమ నివాళికీ మొహం చాటేశారు

Update: 2017-06-04 09:29 GMT
తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు మృతి ఇండస్ట్రీని కలచివేసింది. ఆయన పుణ్యమా అని సినిమాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వారెందరో ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ నుంచి సుకుమార్ వరకు పలువురు దర్శకులు తమ భావాలను అక్షర రూపంలో వెల్లడించి ఆయనపై గౌరవ భావాన్ని చాటుకున్నారు. ఆయన శిష్యుడు మోహన్ బాబు దాసరి అంతిమ యాత్రలో అన్నింటా తానై నిలిచి తన గురువుకు నివాళులర్పించారు.

లెజండరీ దర్శకుడు దాసరి అంతిమ యాత్ర సమయంలో పరిశ్రమ ఆయనకు  ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదంటున్నారు మోహన్ బాబు. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు దాసరి నారాయణరావు మూలంగా వెలుగులోకి వచ్చిన చాలామంది ఆయనకు నివాళి అర్పించడానికి కూడా ముందుకు రాలేదన్నారు. విదేశాల్లోనో... దూర ప్రాంతాల్లోనో ఉన్నవారి సంగతి పక్కన పెడితే ఆ రోజున లోకల్ గా ఉన్నవారు కూడా చాలామంది దాసరి పార్ధివదేహం చూడటానికి రాలేదన్నారు. వారు ఎవరన్నది అన్నది తాను చెప్పదలుచుకోలేదని మోహన్ బాబు అన్నారు. ఒక దిగ్దర్శకుడి స్థాయికి దక్కాల్సిన గౌరవం దాసరికి ఇవ్వలేదని తెగేసి చెప్పారు.

దాసరి నారాయణరావు అంతిమ యాత్ర సందర్భంగా పొలిటికల్ పీపుల్ చక్కగా స్పందించారని మోహన్ బాబు చెప్పారు. దాసరి మృతి చెందారన్న సమాచారం తెలిసిన వెంటనే ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ వెంటనే స్పందించారన్నారు. దాసరి ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఇండస్ట్రీయే గురువుకు సముచిత నివాళి ఇవ్వలేదని  మోహన్ బాబు ఆవేదనాభరితంగా చెప్పుకొచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News