మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో #చిరు152 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా సీనియర్ బ్యూటీ త్రిషను ఎంపిక చేశారు. గతంలో 'స్టాలిన్' సినిమాలో చిరుకు త్రిష జోడీగా నటించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ తో జోడీకట్టడం త్రిషకు ఇది రెండోసారి.
ఇక ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్.. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రతినాయక పాత్రలో కనిపిస్తారట. చిరంజీవితో ఎన్నో సినిమాల్లో మోహన్ బాబు కలిసి నటించారు. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిరు సినిమాల్లో సందడి చేసిన ఆయన చాలాకాలం తర్వాత ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం ఆసక్తికరమైన అంశమే. కొరటాల శివ కథలు సామాజిక సమస్యల నేపథ్యంలో ఉంటాయి. విలన్ పాత్రను కూడా కొరటాల ఎంతో బలంగా తీర్చిదిద్దుతారు. ఈ లెక్కన మోహన్ బాబు విలనీ ఈ సినిమాకు హైలైట్ గా ఉండబోతోందని మనం ఫిక్స్ అయిపోవచ్చు.
వందశాతం సక్సెస్ రేట్ ఉన్న కొరటాల దర్శకత్వంలో చిరంజీవి సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. మోహన్ బాబు విలనీ.. చరణ్ ప్రత్యేక పాత్ర లాంటి అంశాలు కూడా తోడయ్యాయి కాబట్టి ఈ సినిమా క్రేజ్ ఆకాశాన్ని తాకుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.