మోహన్ లాల్.. మామూలు జాక్ పాట్ కాదు

Update: 2016-07-14 11:30 GMT
మోహన్ లాల్ గురించి మరీ తక్కువగా అంచనా వేశారు ‘జనతా గ్యారేజ్’ నిర్మాతలు. పారితోషకం విషయంలో వాళ్లు వేసిన తప్పటడుగు.. మోహన్ లాల్ పంట పండించేసే లాగే ఉంది. ‘జనతా గ్యారేజ్’లో నటించడానికి కోటిన్నర పారితోషకం అడిగితే.. దాని కింద మలయాళం వెర్షన్ రైట్స్ రాసిచ్చేసిన నిర్మాతలు భారీగానే ఆదాయం కోల్పోయేలాగా కనిపిస్తున్నారు. ‘జనతా గ్యారేజ్’ మలయాళ హక్కుల ద్వారా ఐదారు కోట్ల దాకా ఖాతాలో వేసుకోబోతున్నట్లు ఇంతకుముందు వార్తలొచ్చాయి కానీ.. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మోహన్ లాల్ కు అంత కంటే ఎక్కువే ముట్టేలా కనిపిస్తోంది.

‘జనతా గ్యారేజ్’ విషయంలో మలయాళ ప్రేక్షకులకు ఏ స్థాయిలో ఆసక్తి ఉందనడానికి దీని టీజర్ కు వస్తున్న రెస్పాన్సే నిదర్శనం. టీజర్ కు ఇప్పటిదాకా యూ ట్యూబ్ లో 16 లక్షల వ్యూస్ రావడం విశేషం. ఇది మనకు చిన్న నంబర్ లాగే కనిపించొచ్చు కానీ.. మలయాళీలకు మాత్రం చాలా పెద్దదే. ఇప్పటిదాకా డైరెక్ట్ మలయాళ టీజర్లకు కూడా ఈ స్థాయిలో హిట్స్ రాలేదు. మమ్ముట్టి సినిమా ‘కశాబా’ టీజర్ నెలకొల్పిన రికార్డును ‘జనతా గ్యారేజ్’ దాటేసింది. ఈ రెస్పాన్స్ చూస్తుంటే సినిమా మీద మంచి హైప్ ఉంటుందని అర్థమవుతోంది. మోహన్ లాల్ ముందు అనుకున్న దానికంటే భారీ రేట్లకు సినిమాను అమ్ముకునే అవకాశముంది. అంతే కాదు.. దీని శాటిలైట్ రైట్స్ కూడా మోహన్ లాల్ దగ్గరే ఉన్నాయి. అవి కూడా మంచి ధర పలికే ఛాన్సుంది. మొత్తంగా ఈ సినిమాతో ఓ పది కోట్ల దాకా ఖాతాలో వేసుకుంటాడేమో మోహన్ లాల్.
Tags:    

Similar News