ఈసారి ఐపీఎల్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే కరోనా కారణంగా స్టేడియంలో అభిమానులకు అనుమతులు లేవు. పైగా ఈ సారి మ్యాచ్ లు అన్ని కూడా అత్యంత కట్టుదిట్టమైన కరోనా ఏర్పాట్ల మద్య యూఏఈలో జరిగాయి. ఆటగాళ్లు మరియు వారి అత్యంత సన్నిహితులు మరియు జట్టు యాజమాన్యాలు తప్ప ఎవరికి అనుమతులు ఇవ్వలేదు. ప్రతి సీజన్ లో కూడా ఆటగాళ్లను ఉత్సాహ పర్చేందుకు సినీ తారలు కదలి వచ్చే వారు. సన్ రైజర్స్ మ్యాచ్ జరిగితే ఖచ్చితంగా వెంకటేష్ వెళ్లేవాడు. అలా చాలా మంది స్టార్ హీరోలు హీరోయిన్స్ కూడా స్టేడియంలో సందడి చేసేవారు. కాని ఈసారి మాత్రం ఆ సందడి కనిపించలేదు. చివరి రోజు ఒక్క సూపర్ స్టార్ కనిపించారు.
నిన్న రాత్రి ఢిల్లీ ముంబయిల మద్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వెళ్లారు. అక్కడ విఐపీ గ్యాలరీలో ఆయన కూర్చున్నారు. ఈ సీజన్ చివరి రోజున మోహన్ లాల్ స్టేడియంలో కనిపించడం అందరిని ఆశ్చర్యపర్చింది. ఇంతకు మోహన్ లాల్ ఎవరికి మద్దతుగా నిలిచాడు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. దుబాయిలో జరిగిన ఒక కార్యక్రమంకు వెళ్లిన మోహన్ లాల్ పనిలో పనిగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు బీసీసీఐ ఆహ్వానించగా వెళ్లినట్లుగా మలయాళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మొన్నటి వరకు దృశ్యం 2 సినిమా షూటింగ్ లో పాల్గొన్న మోహన్ లాల్ ఇటీవలే దుబాయి వెళ్లారు.