తెలుగు బిగ్ బాస్ నుండి 14వ వారం తర్వాత ఎలిమినేట్ అయిన మోనాల్ గజ్జర్ వరుసగా మీడియా చానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది. ఈమె ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అభిజిత్ పై సున్నితంగా విమర్శలు చేస్తూ యూట్యూబ్ లో హాట్ టాపిక్ గా నిలిచిన మోనాల్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ అంటూ చెప్పుకుంటున్న వారు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారని.. తనను మాత్రమే కాకుండా తన సోదరిని కూడా ట్రోల్స్ చేయడం నాకు చాలా బాధ వేసిందని మోనాల్ ఆవేదన వ్యక్తం చేసింది. తన సోదరిని ట్రోల్ చేసినందుకు గాను సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లుగా మోనాల్ ప్రకటించింది.
మోనాల్ ను కలిసేందుకు బిగ్ బాస్ హౌస్ లోకి హేమాలి వెళ్లిన విషయం తెల్సిందే. ఆ సమయంలో మోనాల్ తో మాట్లాడటంతో పాటు ఇంటి సభ్యులతో కూడా ఆమె మాట్లాడింది. ఆ సమయంలోనే అభిజిత్ కు చిన్న జర్క్ ఇచ్చింది. మీరు మనిషి వెనుక కాదు మనిషి ముందు మాట్లాడండి అంది. ఆ వ్యాఖ్యలు అభిజిత్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి. ఆ విషయాన్ని మోనాల్ కు చెప్పాలి. కాని నువ్వు వెళ్లి అభిజిత్ కు చెప్పావు. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. కొందరు అయితే బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలకు హేమాలి తీవ్రంగా బాధ పడిందట. తన సోదరిని బాధపెట్టిన వారిపై కేసు పెడుతున్నట్లుగా మోనాల్ పేర్కొంది. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతామన్నారట.