తెలుగు బిగ్ బాస్ బడ్జెట్ కాస్త తక్కువ ఉంటుంది. ఆ బడ్జెట్ లోనే కంటెస్టెంట్స్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. వచ్చే ఆదాయం కంటెస్టెంట్స్ పారితోషికం.. స్టాఫ్ ఇలా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని షో ను డిజైన్ చేస్తారు. అందుకే ఫేమస్ సెలబ్రెటీలను బిగ్ బాస్ లో మనం చూడం. ఒక వేళ వాళ్లకు ఆసక్తి ఉన్నా కూడా వారికి పారితోషికం ఇవ్వలేక నిర్వాహకులు వారిని తీసుకు వచ్చేందుకు ఇష్టపడరు. బిగ్ బాస్ నాలుగు సీజన్ ల కంటెస్టెంట్స్ ను చూస్తే వారంకు అయిదు లక్షలు అటు ఇటుగా ఇచ్చే తీసుకు వచ్చారు. కొందరికి వారంకు లక్ష రూపాలు మాత్రమే ఇచ్చి కూడా తీసుకు వచ్చారు. కాని మోనాల్ గజ్జర్ కు మాత్రం ఏకంగా ఆరున్నర నుండి ఏడు లక్షల వరకు పారితోసికంగా బిగ్ బాస్ నిర్వాహకులు ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు గత సీజన్ కంటెస్టెంట్ అయిన శ్రీముఖి తీసుకున్న 5.5 లక్షల పారితోషికం అత్యధికం అంటున్నారు. కాని ఈసారి మాత్రం మోనాల్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఈ సీజన్ లో లాస్యకు దాదాపుగా రూ. 5 లక్షల వరకు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ మొత్తం కలిపి మోనాల్ కు ఏకంగా కోటి వరకు పారితోషికంగా ముట్టి ఉంటుందని అంటున్నారు. ఆమె హౌస్ లో స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్న కారణంగానే ఆ భారీ పారితోషికం అంటున్నారు. మోనాల్ పారితోషికం విషయంలో రికార్డు సృష్టించింది. ఆమెకు అందిన పారితోషికంకు పూర్తి న్యాయం చేసింది అనడంలో సందేహం లేదు. విమర్శలు వచ్చినా కూడా తనకు అప్పగించిన సీక్రెట్ టాస్క్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వర్తించింది.