మంచు విష్ణు.. సునీల్ శెట్టి కీలక పాత్రల్లో రూపొందిన మోసగాళ్లు సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ సినిమాలో కాజల్ అక్కగా మంచు విష్ణు తమ్ముడుగా నటించారు. ఒక రియల్ స్కామ్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్కాంగా నిలిచిన దాన్ని ఆధారంగా చేసుకుని సినిమా ను రూపొందించారు. ఈ సినిమా కథ రీత్యా భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందట. రూ.50 కోట్ల కు పైగానే ఈ సినిమా కోసం ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. సినిమా బడ్జెట్ గురించి మంచు విష్ణు మాట్లాడుతూ నాన్న కు సినిమా బడ్జెట్ గురించి చెప్పినప్పుడు అనుమానం వ్యక్తం చేశారని అన్నారు.
సినిమా కథను తీసుకు వెళ్లి వినిపించిన సమయంలో చాలా బాగుంది. మంచి పాత్రను ఎంపిక చేసుకున్నావని అన్నాడు. ఇదే సమయంలో నీ మార్కెట్ ను మించి ఖర్చు చేయడం ఏమాత్రం శ్రేయష్కరం కాదని హెచ్చరించాడు. బడ్జెట్ మరీ ఎక్కువ అవుతుందని ఒకటి రెండు సార్లు కోపడ్డాడు. అయినా కూడా నేను ఆ సమయంలో మౌనంగా ఆయన మాటలు వింటూ వచ్చాను. కెరీర్ లో కొన్ని సార్లు రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా జీవితంలో ముందుకు వెళ్లడం అనేదే అతి పెద్ద రిస్క్. నాన్న గారు ఎన్నో రిస్క్ లు తీసుకున్నారు. దాని ముందు ఇదో చిన్నదే అని నాకు అనిపించింది. ఈ రిస్క్ లో నాకు ఏదైనా డ్యామేజ్ అయితే అందులో నుండి బయటకు లాగేందుకు నాన్న ఉన్నారనే ధైర్యంతో సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించినట్లుగా మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.