తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రపై ఓ సినిమా రూపొందుతోందని ఎప్పటి నుంచో వార్తలు ఉన్నాయి. నిజానికి జయలలిత స్ఫూర్తితో తీస్తున్న మూవీ తప్ప.. ఇది జయలలిత జీవితం కాదు అంటూ కవరింగ్ కబుర్లు చెబుతున్నా.. సినిమా టైటిల్ 'అమ్మ' కావడంతో జనాలకు అసలు విషయం ఎప్పుడో అర్ధమైపోయింది.
అయితే.. ఇప్పుడీ సినిమా పూర్తిగా ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోందని.. ఈ సినిమాలో అమ్మ పాత్ర చేసిన హీరోయిన్ రాగిణి ద్వివేది అంటోంది. చాలా కాలంగా ఆలస్యం అవుతూ వస్తున్న ఈ చిత్రం.. తమిళనాట తాజా పరిణామాల కారణంగా.. నిరవధికంగా వాయిదా పడచ్చని అంటున్నారు. అసలు ఆగిపోయినా ఆశ్చర్యం లేదని టాక్య. 'ఈ మూవీలోని కొన్ని భాగాలు కాంప్లికేటెడ్ గా ఉంటాయి. కొన్ని నెలలుగా జరుగుతున్న పరిస్థితులు.. అలామార్చేశాయి. ఒక నటిగా నేను నా పని చేశాను. ఇక దాన్ని రిలీజ్ చేయడం అనేది దర్శక నిర్మాతల ఇష్టం' అని చెప్పింది రాగిణి.
'ఈ చిత్రం రిలీజ్ ని ఆపేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. ఇది డైరెక్టుగా ఆమె బయో పిక్ కాదు. ఒక సినిమా ఆగిపోతే బాధ కలగడం సహజం. అయితే.. అన్ని సార్లు ఇది జరగదు కదా' అని చెప్పింది రాగిణి ద్వివేది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/