సీఎంతో సినీ ప్రముఖులు.. చిరుతోపాటు మహేష్ - ప్రభాస్ కూడా..!

Update: 2022-02-10 07:44 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించనున్నారు. చిరంజీవితో పాటుగా మహేష్ బాబు - ప్రభాస్ - రాజమౌళి - కొరటాల శివ - ఆర్.నారాయణమూర్తి - పోసాని కృష్ణమురళి - అలీ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

చిరంజీవి తనకి మాత్రమే ఆహ్వానం అందిందని తొలుత మీడియాతో చెప్పినప్పటికీ.. సమావేశానికి హాజరైన సినీ ప్రముఖులతో కలిసి ఒకే విమానంలో ప్రయాణించారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో సీఎం క్యాంపు ఆఫీసుకు చేసుకున్నారు.

సినిమా టికెట్ల ధరల అంశంతో పాటుగా ఇతర సమస్యలను టాలీవుడ్ పెద్దలు జగన్ కు వివరించనున్నారు. ఈ సమావేశంతో సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ రేట్లు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.35 లో సవరణలు - టికెట్ ధరల పెంపు.. ఏసీ - నాన్ ఏసీ థియేటర్స్ మల్టీప్లెక్స్ లలో కనీస గరిష్ఠ ధరలు - థియేటర్ల మెయింటనెన్స్ మరియు క్యాంటీన్ల నిర్వహణ వంటి అంశాలపై సీఎం జగన్ తో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే సర్కారు నియమించిన కమిటీ సినిమా టికెట్ రేట్ల మీద ఓ నివేదిక అందించింది. దేనిపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.

గత పది నెలలుగా నలుగుతున్న వ్యవహారం ఈరోజుతో ఓ కొలిక్కి వస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. పెద్ద సినిమాలు విడుదలకు రెడీ అవుతున్న తరుణంలో సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి సానుకూలమైన ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News