మూవీపాస్ కి భల్లే గిరాకీ!!

Update: 2018-02-09 11:22 GMT
బస్సుల్లో తిరగడానికి పాస్ లు ఇచ్చినట్లు.. రైళ్లలో సీజన్ టికెట్లు ఇచ్చినట్లు.. పార్కింగ్ ప్లేస్ లకు మంత్లీ పాసులు అమ్మినట్లు.. సినిమా హాళ్లకు కూడా పాస్ లు పెట్టాలనే ఆలోచనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మన దగ్గర ఇంకా ఆలోచనల దగ్గరే ఉన్న ఈ స్కీమ్.. ఇప్పుడు అమెరికాల్లో అమల్లోకి కూడా వచ్చేసింది.

యూఎస్ లో మూవీపాస్ అంటూ ఓ స్కీమ్ స్టార్ట్ అయింది. ఇది సినిమాలు చూసేందుకు ఓ సబ్ స్క్రిప్షన్ స్కీం. అది కూడా చాలా తక్కువ మొత్తానికే అందిస్తున్నారు. ఓ ఏడాది పాటు నచ్చిన సినిమాలను చూసేందుకు 89 డాలర్లు వెచ్చించాలంతే. అంటే మన కరెన్సీలో సుమారుగా ఓ 6 వేల రూపాయలు ఖర్చు చేస్తే.. ఏడాది మొత్తం ఎన్ని సినిమాలైనా థియేటర్లలో చూసేయచ్చు. ఇది డాలర్ల లెక్కలో నెలకు 10 డాలర్ల రేటు కూడా లేకపోవడంతో.. తెగ గిరాకీ ఏర్పడిపోయింది. అతి కొద్ది సమయంలోనే ఏకంగా 20 లక్షలకు పైగా జనాలు ఈ మూవీపాస్ ను కొనుగోలు చేసేయగా.. త్వరలో 3 మిలియన్ల మార్క్ ను కూడా దాటేసే అవకాశం ఉందని అంటున్నారు.

యూఎస్ లో ఉన్న యూత్ లో ఈ మూవీపాస్ కు విపరీతమైన డిమాండ్ ఉండగా.. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దీనికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మూవీ పాస్ తర్వాత థియేటర్లకు వచ్చే జనాభా పెరిగిందని.. అందుకే చిన్న సినిమాలు కూడా హాఫ్ మిలియన్ మార్క్ ఈజీగా అందుకుంటున్నాయని తెలుస్తోంది.
Tags:    

Similar News