విదేశాల్లో తొలుత మూవీ పాస్ ట్రెండ్ పెద్ద సక్సెసైంది. దీనివల్ల సినిమా వీక్షణలో బోలెడంత సౌలభ్యం ఉండడంతో ఆ విధానంపై అంతా ఆకర్షితులయ్యారు. ఒకప్పుడు అధిక టికెట్ ధరల కారణంగా థియేటర్లలో కొత్తగా విడుదలైన సినిమాలు చూడకుండా ఆగిపోయే వారికి ఇది పెద్ద సాయమైంది. జనాల్ని థియేటర్లకు రప్పించడంలో సఫలమైన ఫార్ములా ఇది.
చిన్న చిత్రాలకు మూవీ పాస్ వరం. ఆదాయం పరంగా భారీ ప్రోత్సాహాన్ని ఇచ్చింది. కుటుంబాలను థియేటర్లకు ఆకర్షించడంలోనూ సఫలమైంది. ఇది చిన్న సినిమాలను సులభ ఆర్జన మార్గంగా కనిపించింది. అప్పట్లో పలువురు చిన్న హీరోలకు ఇది పెద్ద సాయమే అయ్యింది. అయితే కాలక్రమంలో రకరకాల లోపాల వల్ల మూవీ పాస్ విధానం చివరకు దివాళా తీసింది.
అయితే కోవిడ్ పర్యవసానంతో దీనిపై ఇటీవల అస్సలు చర్చ అన్నదే లేదు. తాజా సమాచారం మేరకు.. కొంత గ్యాప్ తర్వాత తిరిగి మూవీ పాస్ వెబ్‌సైట్ బరిలోకొస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి కోవిడ్ కి మునుపటి పరిస్థితులకు భిన్నమైనవి కాబట్టి అమెరికాలో ఇంకా కోవిడ్ పూర్తిగా వైదొలగలేదు కాబట్టి ఆ మేరకు ఇబ్బందులు తప్పదు. కానీ తాజా సన్నివేశంలో మూవీ పాస్ విజయవంతం అయితే అది తెలుగు సినిమాకి కలిసొచ్చే అంశం అవుతుంది. అయితే మారిన ట్రెండ్ కి తగ్గట్టు పాస్ విధానం కూడా మారాల్సి ఉంటుందని అంచనా.
మునుముందు పలు క్రేజీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి కాబట్టి .. అమెరికాలో క్రైసిస్ ని పూర్తిగా తరిమి కొట్టే వీలుంది కాబట్టి మూవీ పాస్ ఆలోచన సముచితమేనని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా పునరాగమనం సక్సెసవ్వాలని కోరుకుంటున్నారంతా.