దసరా సందడంతా టాలీవుడ్ లో ఉందే!

Update: 2019-10-08 12:08 GMT
దసరా సీజన్.. ముఖ్యంగా విజయదశమి పండుగకు ఫిలింమేకర్లు చాలా ప్రాధాన్యం ఇస్తారు.  ఈరోజున సినిమా ప్రారంభిస్తే విజయం దక్కుతుందని చాలామందికి నమ్మకం.  అందుకే టాలీవుడ్ లో చాలా సినిమాల లాంచ్ జరుగుతుంది. ఈ రోజున ఆ ట్రెడిషన్ కొనసాగిస్తూ మన ఫిలింమేకర్లు పలు సినిమాలకు కొబ్బరికాయలు కొట్టడం విశేషం.

వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా.  స్టార్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనున్న #చిరు152  చిత్రానికి ఈరోజు హైదరాబాద్ లో పూజాకార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 100% సక్సెస్ రేట్ ఉన్న కొరటాల శివ దర్శకుడు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రారంభోత్సవానికి చిరు అమ్మగారు అంజనాదేవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. చిరు సతీమణి సురేఖ ఈ సినిమాకు ఫస్ట్ క్లాప్ ఇవ్వడం విశేషం.

ఇక యువ హీరో నితిన్ కొత్త సినిమా 'రంగ్ దే'ను ఈరోజే ప్రారంభించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా లాంచ్  కార్యక్రమానికి దిల్ రాజు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  'రంగ్ దే' రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 10 తేదీ నుండి జరుగుతుంది.

సినిమా లాంచ్ కార్యక్రమాలే కాదు.. ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు' కు డబ్బింగ్ మొదలుపెట్టారు. సినిమా షూటింగ్ తో పాటుగా డబ్బింగ్ వర్క్స్ కూడా ఇప్పటినుంచి ప్యారలల్ గా జరుగుతాయని సమాచారం.  వరస హిట్లతో బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపుతున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు.  మహేష్ బాబుకు జోడీగా ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.  సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ మూడు సినిమాలే కాకుండా ఇతర సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్లు.. టీజర్ల రిలీజులతో టాలీవుడ్ ఫిలిం మేకర్ల దసరాను ఫుల్లు సందడిగా మార్చారు.
Tags:    

Similar News