అక్కినేని హీరో అఖిల్ ఇప్పటి వరకు రెండు సినిమాలు చేసి రెంటితో కూడా కమర్షియల్ బ్రేక్ ను దక్కించుకోలేక పోయాడు. మూడవ సినిమాతో ఎట్టి పరిస్థితుల్లో సూపర్ హిట్ కొట్టాలనే పట్టుదలతో చాలా కథలు విని చివరకు వెంకీ అట్లూరితో 'మిస్టర్ మజ్ను' చిత్రాన్ని చేశాడు. అఖిల్ చాలా నమ్మకంతో చేయడంతో పాటు, వెంకీ మొదటి సినిమా 'తొలిప్రేమ' మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా మిస్టర్ మజ్నుపై మొదటి నుండి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో అఖిల్ ప్లే బాయ్ గా, లవర్ బాయ్ గా కనిపిస్తాడని మొదటి నుండే లీక్ లు ఇచ్చారు.
టీజర్ లో అఖిల్ ను ప్లే బాయ్ గా చూపించి ఆసక్తి రేకెత్తించారు. అయితే ట్రైలర్ విషయానికి వచ్చేప్పటికి సినిమా గతంలో వచ్చిన 'ఆరంజ్' సినిమాకు కాస్త దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. చరణ్, జెనీలియాల కాంబినేషన్ లో వచ్చిన 'ఆరంజ్' చిత్రంలో హీరో ఎక్కువ కాలం ప్రేమించను, ప్రేమించి పెళ్లి చేసుకోను అంటూ ఉంటాడు. నిజమైన ప్రేమ ఎక్కువ కాలం ఉండదు, ప్రేమించుకుంటే జీవితాంతం కలిసి ఉండలేం అంటూ ఆ సినిమాలో చరణ్ చెప్పిన ప్రేమ పాఠలు అర్థం కాక సినిమాను ప్లాప్ చేశారు. కాస్త అటు ఇటుగా మిస్టర్ మజ్ను చిత్రంలో కూడా హీరో పాత్ర అలాగే ఉంది.
'మిస్టర్ మజ్ను' చిత్రం ట్రైలర్ లో అఖిల్ పాత్రపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తన లైఫ్ లో లాంగేస్ట్ రిలేషన్ షిప్ నెల రోజులు అంటూ అఖిల్ చెప్పే డైలాగ్ అతడి క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పింది. అమ్మాయిలను ఈజీగా పడేస్తూ, వారితో కొన్ని రోజుల పాటు రిలేషన్ షిప్ కొనసాగించి, ఆ తర్వాత వారికి దూరం అయ్యి కొత్త వారిని వెదుకునే టైప్ అన్నమాట. అలాంటి వ్యక్తి వద్దకు హీరోయిన్ వచ్చి ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం అంటే అప్పట్లో ఆరంజ్ లో చరణ్ అన్నట్లుగానే వామ్మో ఈ పెళ్లి, ప్రేమ నా వల్ల కాదు అంటూ పారిపోతాడు. అయితే ఈ చిత్రం ఆరంజ్ కు వేరియేషన్స్ కూడా చాలానే ఉన్నాయి.
హీరో పాత్ర సేమ్ అయినంత మాత్రాన సినిమా అంతా కూడా అలాగే ఉంటుందనుకోలేం. దర్శకుడు వెంకీ అట్లూరి హీరో పాత్రను అలాగే చూపించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా అతడి క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేశాడేమో చూడాలి. రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 25న మిస్టర్ మజ్ను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించింది.