దళపతి విజయ్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `బీస్ట్` చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. విజయ్ సహా టీమ్ అంతా చిత్రీకరణలో తలమునకలై ఉన్నారు. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఓవైపు షూటింగ్ జరుగుతుంటే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు అంతే వేగంగా జరుగుతున్నాయి. అయితే గురువారం ఉన్నట్లుండి మాజీ భారత క్రికెటర్ ఎంఎస్ ధోని చెన్నైలో అకస్మాతుగా విజయ్ ని కలిసారు. ఆ తర్వాత ఇద్దరూ ఒక ప్రైవేట్ స్టూడియోలో కొద్దిసేపు సమావేశమయ్యారు.
మరీ ఇలా ఆకస్మిక కలయిక దేనికోసం? దళపతిని క్యాజువల్ గానే కలిసారా? లేక సినిమా- రాజకీయాలకు సంబంధించిన అంశాలేమైనా చర్చకు వచ్చాయా? అన్నది కొద్ది రోజులు ఆగితే గానీ తెలియదు. ఈ ఇద్దరి కలయిక జాతీయ మీడియాలో సైతం హైలైట్ అయింది. నేరుగా విజయ్ వద్దకు ధోని ఎందుకు వెళ్లాడంటూ రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. సాధారణంగా ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలతో ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంతర్జాతీయ క్రికెటర్లు బాలీవుడ్ నటుల్ని కలవడానికి ఇష్టపడుతుంటారు. బాలీవుడ్ తారలు అంతే ఆసక్తిని కనబరుస్తారు.
కానీ ధోని ఇప్పుడు సౌత్ హీరోని కవలడం వెనక ఏం జరుగుతోంది? ఏదో ఇంట్రెస్టింగ్ విషయమే దాగి ఉంటుందని బలమైన ప్రచారం జరుగోతోంది. ఆ విషయం పక్కనబెడితే ధోని కొద్దికాలంగా సూపర్ కింగ్స్ సహచరులతో కలిసి చెన్నైలో ఉంటున్నారు. త్వరలో ఈ బృందం మొత్తం యుఎఈకి బయలుదేరుతుంది. ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడటం మొదలుపెట్టినప్పటి నుండి చెన్నై అతనికి రెండవ ఇల్లుగా మారిన సంగతి తెలిసిందే.