2017లో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు.. ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారాల్లో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ మొదలు పెట్టింది. ఇప్పటికే పలువురి సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించారు. ఈ క్రమంలో నేడు బుధవారం ఉదయం నటి ముమైత్ ఖాన్ ఈడీ అధికారులు ముందు హాజరయ్యింది.
డ్రగ్స్ వ్యవహారాల్లో ఆర్థిక లావాదేవీలు జరిగాయనే కోణంలో ఈడీ అధికారులు ముమైత్ ఖాన్ బ్యాంకు ఖాతాలను పరిశీలించనున్నారు. ఆమె బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ తీసుకురావాల్సిందిగా ఈడీ ముందుగానే నోటీసులలో పేర్కొన్నారు. ఈరోజు ముమైత్ పలు డాక్యుమెంట్స్ తో ఈడీ కార్యాలయానికి వచ్చింది. అందులో అనుమానాస్పద లావాదేవీల గురించి ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు.
అలానే ఎఫ్ క్లబ్ లో జరిగే పార్టీలకు హాజరయ్యారా లేదా? డ్రగ్స్ వినియోగించే సెలబ్రిటీలతో ఏమైనా సంబంధాలున్నాయా? డ్రగ్స్ సప్లయిర్ కెల్విన్ తో ఉన్న పరిచయం ఏంటి? ఆయనకు ఎప్పుడైనా డబ్బులు ట్రాన్సఫర్ చేసారా? వంటి వివరాలపై ముమైత్ ను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నాలుగేళ్ళ క్రితం టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చినప్పుడు.. ఎక్సైజ్ శాఖ విచారణకు కూడా ముమైత్ ఖాన్ హాజరైన సంగతి తెలిసిందే.
ఇకపోతే డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటివరకు కెల్విన్ తో సహా పూరీ జగన్నాథ్ - ఛార్మి కౌర్ - రకుల్ ప్రీత్ సింగ్ - నందు - రవితేజ - రానా దగ్గుబాటి - నవదీప్ వంటి సినీ ప్రముఖులను ఈడీ అధికారులు విచారించి వారి స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ముమైత్ వంతు వచ్చింది. సెప్టెంబర్ 17న తనీష్ - సెప్టెంబర్ 22న తరుణ్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. వీరిని ప్రశ్నించడంతో సినీ ప్రముఖుల విచారణ ముగుస్తుంది.