బిబి నాన్ స్టాప్ లీక్ : సిగరెట్ ఇష్యూ తో ఆమె ఔట్
తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ అలా అలా సాగుతూ ఉంది. రెగ్యులర్ బిగ్ బాస్ రేంజ్ లో జనాలు ఈ ఓటీటీ బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవడం లేదు. నెట్టింట పెద్ద ఎత్తున చర్చ కూడా ఈ షో గురించి సాగడం లేదు. ముందు ముందు ఏదైనా వివాదం లేదా మరేదైనా ఆసక్తికర పాయింట్ వస్తే అప్పుడు షో కు ఏమైనా రేంజ్ పెరుగుతుందేమో చూడాలి. జనాల్లోకి షో ఇంకా పూర్తి స్థాయిలో వెళ్లకుండానే మొదటి వారం పూర్తి అయ్యింది.
మొదటి వారం పూర్తి అయిన తర్వాత హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయంలో లీక్ వచ్చింది. మొదటి వారంలో సరయు.. మిత్రా శర్మ.. హమీదా.. నటరాజ్ మాస్టర్.. ఆర్జే చైతూ.. ముమైత్ మరియు అరియానాలు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. వీరిలో మిత్రా మరియు నటరాజ్ మాస్టర్ లకు నెగటివిటీ ఎక్కువ ఉంటుందని మొదటి రెండు రోజుల చర్చ జరిగింది. కాని అనూహ్యంగా ముమైత్ ఖాన్ చేసిన ఓవర్ యాక్షన్ ఆమె ఎలిమినేషన్ కు దారి తీసింది.
మిత్రా శర్మ గ్రాఫ్ అనూహ్యంగా పెరగడానికి ముమైత్ గ్రాఫ్ దిగి పోయింది. ఆర్జే చైతూ ఒక సందర్బంలో ప్రతి రోజు ఉదయమే సిగరెట్ల కోసం కెమెరాల వద్దకు వెళ్లి ముమైత్ ను అడుక్కోవడం నచ్చలేదు అన్నట్లుగా చెప్పాడు. అది కాస్త ముమైత్ ఖాన్ మరో యాంగిల్ లో తీసుకుంది. దాదాపు రెండు రోజుల పాటు ఆ ఇష్యూను డ్రాగ్ చేస్తూ ముమైత్ ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది.
ఆ కారణంగానే ముమైత్ ఖాన్ ను జనాలు తిరష్కరించి ఉంటారు అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ముమైత్ ఖాన్ కు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బయటకు వెళ్లి పోవాల్సి వచ్చింది. షో లో కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కు వారి ప్రవర్తన నూటికి నూరు శాతం కారణం ఉంటుంది. ముమైత్ ఖాన్ ప్రవర్తన ఆమె నామినేషన్ లో ఉండటానికి కారణం అయ్యింది.. ఆ తర్వాత ఎలిమినేషన్ కు కూడా కారణంగా నిలిచిందని కామెంట్స్ వస్తున్నాయి.
బిగ్ బాస్ నాన్ స్టార్ లో మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించగా వారు చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. కొత్త మరియు పాత వారి కలయికలో జరిగిన ఎంపిక తో ప్రేక్షకుల్లో మొదటి నుండి ఆసక్తి ఉంది. ఆ ఆసక్తిని మరింతగా పెంచేలా షో లో కొత్త వారికి మరియు పాత వారికి మద్య పంచాయితీలు పెడుతూ మొదటి వారం ను రక్తి కట్టించే ప్రయత్నాలను బిగ్ బాస్ చేశాడు. ముమైత్ ఖాన్ వెళ్లి పోవడంతో హౌస్ లో ఎమోషన్స్ బ్యాలన్స్ అవుతాయని కామెంట్స్ చేసే వారు చాలా మంది ఉన్నారు. ముమైత్ ఎలిమినేషన్ విషయం ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయితే అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.