బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ యావత్ దేశాన్ని ఎంత సంచలనాన్ని రేకెత్తించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో బలవన్మరణంతో బాలీవుడ్ దిగ్గజాలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా ఎదిగిన సుశాంత్.. సూసైడ్ చేసుకునే వరకు వెళ్లటంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడటమే కాదు.. బాలీవుడ్ ప్రముఖులపై ఘాటుగా రియాక్టు అవుతున్నారు. ఇండస్ట్రీలోని నెపోటిజం మీదనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. సుశాంత్ సూసైడ్ కేసు విచారణలో ముంబయి పోలీసులు తలమునకలవుతున్నారు. ఈ కేసును త్వరగా లెక్క తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికి ఇరవై ఎనిమిది మంది స్టేట్ మెంట్స్ ను రికార్డు చేశారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సంజన సంఘీని పోలీసులు విచారణకు పిలిచారు. ఆమెను విచారణకు పిలవటానికి కారణం.. సుశాంత్ తో కలిసి నటించిన చివరి సహనటి కావటమే.
సుశాంత్ మానసిక పరిస్థితి.. షూటింగ్ సమయాల్లో అతని తీరు ఎలా ఉండేదన్న విషయాలతో పాటు.. ఇతర విషయాల్ని తెలుసుకునేందుకు ఆమెను విచారణకు పిలిచినట్లుగా తెలుస్తోంది. విచారణకుహాజరైన సంజన.. పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యనే సుశాంత్ పోస్టు మార్టం రిపోర్టు వచ్చింది. అందులో బలమైన వస్తువుతో గొంతు బిగించుకోవటం ద్వారా ఊపిరి ఆడక.. మరణించినట్లుగా పేర్కొన్నారు. పోలీసులు చేస్తున్న విచారణలో ఏమైనా కొత్త అంశాలు బయటకు వస్తాయేమో చూడాలి.