సుషాంత్‌ పై ఆమె మీటూ ఆరోపణలు చేయలేదట

Update: 2020-07-02 10:19 GMT
బాలీవుడ్‌ స్టార్‌ సుశాంత్‌ ఆత్మహత్య కేసును విచారిస్తున్న పోలీసులు ఇటీవలే ఆయనతో నటించిన హీరోయిన్‌ సంజన సంఘిని ప్రశ్నించారు. ఆ సమయంలో పలు విషయాలను వారు ఎంక్వౌరీ చేసినట్లుగా బాలీవుడ్‌ టాక్‌. సుశాంత్‌ గురించి ఆమె వద్ద విషయాలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటీ అనే విషయాలను కూడా ప్రశ్నించారట. ఇదే సమయంలో బాలీవుడ్‌ మీడియాలో ఆమె మీటూ ఆరోపణల కారణంగానే ప్రశ్నించారు అనే టాక్‌ వినిపిస్తుంది.

రెండు సంవత్సరాల క్రితం బాలీవుడ్‌ లో మీటూ ఉద్యమం ఓ స్థాయిలో ఉవ్వెత్తున ఎగసి పడినది. ఆ సమయంలో సంజన సంఘి కూడా సుశాంత్‌ గురించి ఆరోపణలు చేసిందనే వార్తలు వచ్చాయి. మీటూ ఆరోపణలు మీరు చేయడంకు కారణం ఏంటీ ఆయన ఆ కారణం వల్ల ఏమైనా డిప్రెషన్‌ కు వెళ్లి పోయి ఉంటాడా అనే విషయమై కూడా పోలీసులు ప్రశ్నించారని టాక్‌. తాజాగా తన గురించి మీడియాలో వస్తున్న వార్తలపై సంజన స్పందించింది.

తాను ఎప్పుడు కూడా సుశాంత్‌ గురించి మీటూ ఆరోపణలు చేయలేదు. ఆయనను మొదట షూటింగ్‌ స్పాట్‌ లోనే కలిశాను. సినిమా ఆడిషన్స్‌ కోసం నన్ను పిలిచారు. ఆ సమయంలో నేను వెళ్లాను. కొన్ని రోజుల తర్వాత మీరు సుశాంత్‌ తో కలిసి నటించాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత నేను ఆయన్ను సెట్స్‌ లోనే చూశానంటూ ఆమె పేర్కొంది. అంతకు మించి మా ఇద్దరి మద్య ఎక్కువగా పరిచయం కూడా లేదని పోలీసులకు తెలియజేశానంటూ పేర్కొంది.
Tags:    

Similar News