అకీరా.. బాలీవుడ్ లో కొన్ని నెలల నుంచి బాగా క్యూరియాసిటీ క్రియేట్ చేసిన సినిమా ఇది. ఈ మూవీ కోసం అందాల భామ సోనాక్షి సిన్హా తెగ ఫైట్లు చేసేస్తూ కనిపించడం.. ఈ సినిమా కోసం రియల్ గా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేయడం.. పోస్టర్ లో చూపించినవి గ్రాఫిక్స్ కాదని చెప్పేందుకు ప్రమోషన్స్ లో రియల్ గానే స్టంట్స్ చేయడం లాంటివా బాగా ఆసక్తి కలిగించాయి. ఇప్పుడీ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. టాక్ కూడా బాగానే ఉంది.
తమిళ మౌనగురుకు రీమేక్ గా అకీరా రూపొందగా.. ఒరిజినల్ కు చాలానే మార్పులు చేశాడు దర్శకుడు మురుగదాస్. తనకు తెలిసిన అమ్మాయిపై జరిగిన యాసిడ్ దాడి గురించి తెలిసిన బుల్లి అకీరా.. అప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది. ఈమె కారణంగా ఓ అబ్బాయికి దెబ్బలు తగలడంతో.. మూడేళ్ల పాటు రిమాండ్ హోమ్ లో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ముంబై వెళ్లిన అకీరా అక్కడ ఓ నలుగురు అవినీతి పోలీసుల కారణంగా కేసులో ఇరుక్కుంటుంది. దీన్నుంచి బయటపడేందుకు అకీరా ఏం చేసిందన్నదే మిగిలిన స్టోరీ.
టైటిల్ రోల్ లో సోనాక్షి ఇరగదీసేసిందంతే. ఇక నెగిటివ్ రోల్ అయిన అసిస్టెంట్ కమీషనర్ గోవింద్ రాణే పాత్రలో అనురాగ్ కశ్యప్ పాత్ర అదరహో అనాల్సిందే. మిగిలిన పోలీస్ పాత్రలు కూడా బాగానే ఉంంటాయి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పాత్రలో నిండు గర్భవతిగా కొంకణా శర్మ కూడా అదరగొట్టేసింది. మొత్తం మీద అకీరా మూవీలో అన్ని పాత్రలను అందరికీ నచ్చేలా అందరూ మెచ్చేలా తీర్చిదిద్దడంలో మురుగదాస్ బాగానే సక్సెస్ అయ్యాడు.