రకుల్ కి హ్యాండ్ ఇచ్చిన దర్శకుడు

Update: 2017-11-16 04:36 GMT
టాలీవుడ్  బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. మొదట తన కెరీర్ ను తమిళ్ లోనే ఆరంభించింది. అక్కడ కాలం కలిసి రాకపోవడం.. వరుసగా పరాజయాలు చవిచూడడం.. అదే సమయంలో తెలుగులో వరుస అవకాశాలు.. వాటిలోనూ మంచి సక్సెస్ లు ఉండడంతో.. హైద్రాబాద్ ను తన అడ్డాగా మార్చేసుకుంది రకుల్ ప్రీత్.

అయితే.. తమిళ్ లో సత్తా చాటాలనే ఈమె డ్రీం మాత్రం అలాగే ఉండిపోయింది. స్పైడర్ మూవీతో దర్శకుడు మురుగదాస్ తన కోరిక తీర్చేశాడని నమ్మకం పెట్టుకోగా.. ఆ ఆశలు కూడా ఆవిరి అయిపోయాయి. కానీ మురుగదాస్ తెరకెక్కించనున్న మరుసటి చిత్రంలో ఈమెకు అవకాశం ఇచ్చాడనే టాక్ ఇన్నాళ్లు ఉంది. విజయ్ హీరోగా రూపొందే 62వ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక అనే ప్రచారం ఇప్పటివరకూ జరగగా.. ఇప్పుడీమెకు హ్యాండ్ ఇచ్చేసి.. నయనతారను తీసుకున్నారనే టాక్ మొదలైంది. తాజాగా ఆరామ్ మూవీతో గ్రాండ్ విక్టరీ కొట్టేసిన నయన్ ను విజయ్ మూవీలో హీరోయిన్ గా తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

నయనతారతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తుందా.. లేక రకుల్ కి అనుకున్న రోల్ నే నయన్ కు ఆఫర్ చేస్తున్నారా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కానీ కోలీవుడ్ లో సూపర్ స్టార్ రేంజ్ లో ఉన్న నయన్ కారణంగా.. రకుల్ ప్రీత్ సింగ్ కు షాక్ ఎదురవుతోందనే టాక్ మాత్రం ఉంది. ఈ శుక్రవారం నటిస్తున్న కార్తి మూవీ ధీరన్ అధికారం ఒండ్రు(తెలుగులో ఖాకీ) మూవీ.. కోలీవుడ్ లో రకుల్ ఫ్యూచర్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్ అనచ్చు.
Tags:    

Similar News