మురగ మళ్ళి అతనినే నమ్ముకున్నాడా?

Update: 2016-05-27 04:31 GMT
క్రియేటివ్ డైరెక్టర్ మురగదాస్ తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో వుండనున్న విషయం తెలిసినదే. బ్రహ్మోత్సవం సినిమా తరువాత హాలిడేకి వెళ్ళిన మహేష్ తిరిగి రాగానే ఈ సినిమా మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం.

అయితే ఈ సినిమాకు సంగీతదర్శకుడిగా మురగదాస్ తిరిగి హరీస్ జయరాజ్ కే ఓటు వేసినట్టు సమాచారం. వీరి కాంబినేషన్ లో తొలినాళ్ళలో వచ్చిన అన్ని ఆల్బమ్స్ సూపర్ హిట్ గా నిలిచినా ఇటీవల అంతగా మజా ఇవ్వకపోవడంతో కత్తి సినిమాకు అనిరుద్ ని ఎంపిక చేసుకున్నాడు. ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అవ్వడంతో మరోసారి అనిరుద్ కే ఓటు వేస్తాడని అనుకున్నారంతా..

అయితే మురగ నిర్ణయంపై పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేడు. సైనికుడు సినిమాకు మహేష్ కి హారీస్ మంచి మ్యుజిక్కే ఇచ్చాడు. ఈ సినిమా న్యాయ వ్యవస్థను ప్రశ్నించే కధాకధనాలతో రూపుదిద్దుకొబోతుందని సమాచారం.
Tags:    

Similar News