తెలుగు స్టార్ హీరోల సినిమాలకు.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇద్దరు సంగీత దర్శకుల పేర్లు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ మరియు థమన్ లు కాకుండా అప్పుడప్పుడు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా పెద్ద సినిమాలకు సంగీతాన్ని అందించే అవకాశాన్ని దక్కించుకుంటున్నాడు. కానీ ట్యాలెంటెడ్ మ్యూజిక డైరెక్టర్ గోపీ సుందర్ మాత్రం పెద్ద సినిమాలను దక్కించుకోలేక పోతున్నాడు.
గీతా ఆర్ట్స్ వారు గోపీసుందర్ కి అవకాశాలు ఇస్తున్నారు. కానీ వారు చిన్న సినిమాలకు మాత్రమే సంగీతాన్ని చేయించుకుంటున్నారు. పెద్ద సినిమాలు నిర్మిస్తే వాటికి ఎప్పటిలాగే వారిద్దరిలో ఒకరితో వర్క్ చేయించుకుంటున్నారు. తాజాగా మరో విజయాన్ని గోపీసుందర్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా కూడా ఫిల్మ్ మేకర్స్ ఈయన్ను పట్టించుకోవడం లేదు.
మలయాళ సినిమా ఇండస్ట్రీ కి చెందిన గోపీ సుందర్ గీతా గోవిందం సినిమాతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు భలే భలే మగాడివోయ్ సినిమా కు కూడా మంచి సంగీతాన్ని అందించి ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈయన అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయ్యింది. అంతే కాకుండా చాలా సినిమాలకే ఈయన వర్క్ చేసి సక్సెస్ లు కూడా దక్కించుకున్నాడు.
అయినా ఇప్పటి వరకు కూడా ఒక్క స్టార్ హీరో అంటే ఒక్కరు కూడా ఈయనకు ఛాన్స్ ఇవ్వలేదు. స్టార్ డైరెక్టర్స్ మరియు ఫిల్మ్ మేకర్స్ వద్ద ఈయన లాబీయింగ్ చేసుకోలేక పోతున్నాడు అని.. అందుకే పెద్ద సినిమాలకు సంగీతాన్ని అందించే అవకాశాలు దక్కించుకోలేక పోతున్నాడు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇండస్ట్రీలో ప్రతిభతో పాటు మాటకారితనం కూడా ఉండాలి. సినిమా ప్రమోషన్ సమయంలో ఇతర స్టార్స్ దృష్టిని ఆకర్షించే విధంగా మాట్లాడాలి.. మంచి మాటలతో అవతలి వారిని ఆకట్టుకోవాలి. ఆ విషయంలో గోపీ సుందర్ కాస్త వెనకబడి ఉన్నాడు.
అందుకే టాలీవుడ్ లో ఇంకా మీడియం బడ్జెట్ సినిమాలను.. చిన్న హీరోల సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. ముందు ముందు అయినా ఈయన నుండి పెద్ద హీరోల సినిమాలు చూస్తామా అనేది సందేహమే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.