సూపర్ స్టార్ రజని కాంత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ మాత్రమే కాదు దేశ విదేశాల్లోనూ ఉందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్-చైనా-మలేషియా లాంటి చోట్ల అభిమానులు కోట్లలో ఉన్నారు. సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం 1998లో ముత్తుని జపాన్ లో విడుదల చేసినప్పుడు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టి కోట్లాది రూపాయలను వసూళ్ల రూపంలో కురిపించారు. ఒక మాములు కమర్షియల్ సినిమాకు ఇంత ఆదరణ దక్కడం ఒక్క రజని విషయంలోనే జరిగింది. ఆ రికార్డులు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ఆ తర్వాత చాలా రజని సినిమాలు జపాన్ కు వెళ్లినా ముత్తు మేజిక్ మాత్రం చేయలేకపోయాయి.
మరొక్కసారి దాన్ని రిపీట్ చేయడం కోసం ముత్తు నిర్మాణ సంస్థ కవితాలయ దీన్ని 4కె రిజొల్యూషన్ కు రీ మాస్టర్ చేసి దానికి డాల్బీ అట్మోస్ సౌండ్ ని జోడించి మరోసారి రేపు భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. దానికో ట్రైలర్ కూడా స్పెషల్ గా రూపొందించారు. ఒక సినిమా ఇరవై ఏళ్ళ తర్వాత ఈ స్థాయిలో ఫారిన్ లో విడుదల కావడం అంటే విశేషమేగా. తలైవా ఫాన్స్ దీన్నో పెద్ద సంబరంగా చెప్పుకుంటున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ముత్తులో రజని డ్యూయల్ రోల్ చేసాడు.
ధనవంతుడైన తన ఇంట్లోనే పనివాడైన కొడుకుగా కోట్ల ఆస్తి ఉన్నా బిచ్చగాడిగా మారిన తండ్రిగా రజని నటన పీక్స్ లో ఉంటుంది. మీనా గ్లామర్ రెహమాన్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ తెలుగులో సైతం సూపర్ హిట్ అయ్యేలా చేశాయి. కొన్నేళ్ల క్రితమే ముత్తుని బ్లూ రే డిస్క్ రూపంలో విడుదల చేసింది కవితాలయ. ఇప్పుడు జపాన్ ప్రేక్షకులు ముత్తుని మరింత స్పష్టంగా అదిరిపోయే సౌండ్ తో ఎంజాయ్ చేయబోతున్నారు. ఇప్పుడు కూడా హిట్ అయ్యిందంటే మాత్రం బాషా-నరసింహలు కూడా క్యూ కడతాయేమో
Full View