సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో దాదాపు పది సినిమాలు చేస్తుంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతున్న ఈ అమ్మడు ఇటీవల ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ను కూడా ఓకే చేసింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఈ అమ్మడి పెళ్లి వార్తలు కూడా జోరుగా వస్తున్నాయి.
ఇప్పటికే ఈమె నటుడు కమ్ నిర్మాత అయిన జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. అతడితో ఉన్న కొన్ని ఫొటోలను అప్పట్లో షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ మద్య కాలంలో ఎక్కడ కూడా ఆయన ఫొటోలను లేదా వీడియోలను షేర్ చేయలేదు.
ప్రేమలో ఉన్న వాళ్లు ఒకరి ఫొటోలను ఒకరు షేర్ చేసుకోవడం.. ప్రతి సందర్బంను సెలబ్రేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో నిత్యం సందడి చేయడం మనం ఇప్పటి వరకు చూశాం. కాని వీరిద్దరి జోడి ఇలా ఉందేంటి అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ తన రిలేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది.
తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మేము ఇద్దరం కూడా కలిసి డేటింగ్ లకు వెళ్లాలి.. సోషల్ మీడియాలో హడావుడి చేయాలని అనుకోం. మా పర్సనల్ లైఫ్ ను సింపుల్ గా కొనసాగించాలని భావిస్తాం. ఆ విషయాలను బయటకు తెలియడానికి ఇష్టపడము. ఇద్దరం కలిసి ఎక్కువగా జిమ్.. ఫుడ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. తమ ప్రేమ విషయాలను పంచుకోవడానికి ముందు ముందు చాలా సమయం ఉందని రకుల్ చెప్పుకొచ్చింది.
జాకీ తో ప్రతి రోజు కొత్తగా ఉంటుంది.. అతడి వెంట ఉన్నప్పుడు నాకు నేను కొత్తగా అందంగా కనిపిస్తాను అంటూ వ్యాఖ్యలు చేసింది. రకుల్ వ్యాఖ్యలకు సినిమా డైలాగ్ లు చెబుతున్నావేంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రకుల్ ప్రపంచంలోని ప్రేమలందు మా ప్రేమ వేరంటూ చెప్పకనే చెప్పింది. ఈ విభిన్నమైన ప్రేమను పెళ్లి వరకు ఎప్పుడు తీసుకు వెళ్తారంటూ కొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు.