లుక్ కాదు కేరక్టర్ ఉండాలంటున్న మెగా హీరో

Update: 2016-05-07 07:52 GMT
మెగా ఫ్యామిలీ హీరోలందరిలో లుక్ విషయంలో ఎక్కువ మార్కులు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కే పడతాయి. ఆరడుగులకు మించిన హైట్ - దిట్టమైన పర్సనాలిటీ - వైట్ స్కిన్ టోన్ తో చూడగానే ఆకట్టుకునే వరుణ్ తేజ్.. ఇప్పుడు రకరకాలుగా కనిపిస్తున్నాడు. ఎప్పుడు బైట కనిపించిన డిఫరెంట్ మేకోవర్ తో కనిపించడం వరుణ్ తేజ్ కి అలవాటయిపోయింది.

ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఛేంజెస్ చూపించిన హీరో మరొకరు ఉండరేమో. ఇదంతా క్రిష్ తో చేస్తాడని భావించిన రాయబారి కోసం అనే టాక్ గతంలో వచ్చింది. ఆ ప్రాజెక్ట్ అటకెక్కేసినా.. మనోడు మాత్రం తన లుక్ లో అనేక మార్పులు చూపిస్తూనే ఉన్నాడు. ఇదంతా తన లుక్ పై చేస్తున్న ప్రయోగాలు అంటున్నాడు వరుణ్ తేజ్. గతేడాది నవంబర్ లో 'నో షేవ్ నవంబర్' కేంపెయిన్ పై ఇంట్రెస్ట్ తో గడ్డం పెంచాడట ఈ మెగా హీరో. అప్పటికి సినిమాలేవీ స్టార్ట్ చేయకపోవడంతో.. రకరకాల లుక్స్ ని ట్రై చేద్దామనే ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచనతోనే ఇప్పటివరకూ అనేక లుక్స్ ట్రై చేసి, వాటిని దాచిపెడుతున్నాడట వరుణ్ తేజ్.

తనను డిఫరెంట్ చూపిద్దామని ఏ డైరెక్టర్ అయినా అనుకుంటే.. అప్పుడీ ఫోటోలు చూపిస్తే సరిపోతుందిగా అంటున్న వరుణ్ తేజ్.. తను ఇలా లుక్స్ తో కాకుండా.. తను చేసే కేరక్టర్లతో పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. తను చేసిన మూడు సినిమాల్లో మూడు రకాల విభిన్న పాత్రల్లో కనిపించగా..  ప్రస్తుతం శ్రీను వైట్లతో చేస్తున్న మిస్టర్ కూడా.. ఇలాగే పేరు తెచ్చిపెడుతుందని నమ్మకంగా ఉన్నాడు వరుణ్ తేజ్.
Tags:    

Similar News