షారూక్ తీసిన సెల్ఫీలో ‘ఆమె ఎవరు’?

Update: 2017-02-06 09:22 GMT
చిన్న చిన్న సంఘటనలు కొంతమందికి ఎంత అదృష్టాన్ని.. ఇమేజ్ ను తీసుకొస్తాయో చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. అచ్చం సినిమాటిక్ గా ఉండే ఈ ఉదంతం గురించి వింటే.. నిజమనుకోవాల్సిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ తీసిన ఒక సెల్ఫీ ఒక అమ్మాయికి వరంగా మారటమే కాదు.. రాత్రికి రాత్రి ఆమెను సన్సేషనల్ సెలబ్రిటీలా మార్చటమే కాదు.. ఆన్ లైన్లో ఇప్పుడామె గురించి చర్చ భారీగా సాగుతోంది.

షారూక్ తన తాజా చిత్రం రయిస్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఫుణెలోని ఒక కాలేజీకి వెళ్లాడు. అక్కడి యువతతో కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫోటోను గత వారం తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ఇక్కడే ఒక విచిత్రం చోటు చేసుకుంది. బాలీవుడ్ బాద్షా పోస్ట్ చేసిన సెల్పీలో  ఆలివ్ గ్రీన్ టాప్ వేసుకున్న ఒక అమ్మాయి అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది.

ఆ అమ్మాయి చాలా అందంగా ఉందని.. ఆమె హీరోయిన్ గా పనికి వస్తుందంటూ వ్యాఖ్యలు పెరిగాయి. ఈ చర్చ అంతకంతకూ పెరగటమే కాదు.. ఈ కొత్త అందం ఎవరు? ఎక్కడికి చెందిన అమ్మాయి.. అంటూ ఆరా తీయటం.. ఆమెకు సంబంధించిన వివరాలు బయటకు రావటం మొదలైంది. చివరకు ఆ అమ్మాయి కశ్మీర్ కు చెందిన సైమా హుస్సేన్ గా తేలింది. ఇప్పుడు ఆమె ఫేస్ బుక్ పేజీని సెర్చ్ చేస్తున్న నెటిజన్లు.. ఆమెను.. ఆమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు. ఇంటర్నెట్ లో ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిన ఈ కొత్త అందానికి బాలీవుడ్ లో అవకాశాలు రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News