యాంటోన్ ఫిషర్.. 2002లో విడుదల అయిన ఈ హాలీవుడ్ మూవీ వెనుక చాలానే కథ ఉంది. ఈ సినిమా కథ మాత్రమే కాదు.. ఓ వ్యక్తి జీవితం. తన జీవితాన్ని తనే రాసుకున్న యాంటోన్ ఫిషర్.. తనే సహ నిర్మాణం వహించి అదే పేరుతో సినిమా తీసి సక్సెస్ సాధించాడు.
ఇంతకీ యాంటోన్ ఫిషర్ కథ ఏంటంటే.. చిన్న వయసులో తీవ్ర వేధింపులు-తిట్లకు గురైన ఓ వ్యక్తి.. ఆ తర్వాత యూఎస్ నేవీలో సైలర్ గా చేరతాడు. కానీ చిన్న వయసులో జరిగిన సంఘటనల ప్రభావంతో ఎప్పుడూ విపరీతమైన కోపంతో ఉండి ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ.. తన అసలైన తల్లిదండ్రుల కోసం వెతుక్కుంటూ ఉంటాడు. బన్నీ మూవీ నా పేరు సూర్య కూడా ఇందుకు దగ్గరగానే ఉంటుంది. కాకపోతే హీరో కోపిష్టివాడిగానే ఉంటాడు కానీ.. చిన్నతనం కష్టాలను కట్ చేసి పారేశారు.
అందుకే మనకు బన్నీ పాత్ర ఎందుకు అంత తీవ్రంగా రియాక్ట్ అవుతుందో అంతు చిక్కదు. ఇక సైక్రియాట్రిస్ట్ పాత్రలోకి తండ్రి క్యారెక్టర్ ని తెచ్చేశారు. దాదాపుగా యాంటోన్ ఫిషర్ కథను పక్కాగా ఇన్ స్పిరేషన్ తీసేసుకుని నా పేరు సూర్య కథను వక్కంతం రాసుకున్నాడనే టాక్ ఉంది. ఇది నిజమో కాదో చెక్ చేసుకునేందుకు ఇప్పుడు యాంటోన్ ఫిషర్ మూవీని తెగ చూసేస్తున్నారు జనాలు. ఓ ఎటెంప్ట్ హానెస్ట్ గా చేశామని చెబుతున్న నా పేరు సూర్య మేకర్స్.. ఈ విషయం పై కూడా హానెస్టీ చూపించే ఛాన్స్ ఉందంటారా?