‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో వెంకటేష్ కొడుకుగా నటించిన నాగ అన్వేష్ ‘వినయయ్యా రామయ్యా’ అనే సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఐతే నాగ అన్వేష్ తండ్రి ‘సింధూర పువ్వు’ కృష్ణారెడ్డి కొడుకు కోసం ఈసారి ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి ‘ఏంజెల్’ అనే సినిమా తీశాడు. రాజమౌళి దగ్గర శిష్యరికం చేసిన పళని ఈ చిత్రాన్ని రూపొందించాడు.
హెబ్బా పటేల్ లాంటి గ్లామర్ తార కథానాయికగా నటించినా.. కబీర్ సింగ్ దుల్హన్ విలన్ పాత్ర చేసినా.. సినిమా మీద కొంచెం భారీగానే ఖర్చు పెట్టినా.. దీనికి అనుకున్నంతగా బజ్ రాలేదు. రెండు నెలల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్న ఈ సినిమాకు మోక్షం కలగలేదు. బయ్యర్ల నుంచి ఆశించిన స్పందన లేకపోవడమే దీనికి కారణమంటున్నారు. ఐతే ఇప్పుడు ఈ చిత్రాన్ని మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లుగా యూనిట్ వర్గాల నుంచి మీడియాకు సమాచారం అందింది.
తమిళంతో పాటు హిందీలోనూ ‘ఏంజెల్’ సినిమాను రిలీజ్ చేస్తారట. అది కూడా ఒకేసారి మూడు భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారట. అందుకే సినిమా ఆలస్యమవుతోందట. ఈ చిత్రంలో 45 నిమిషాల పాటు విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని.. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆలస్యమైందని చెబుతున్నారు. ఐతే తెలుగులోనే విడుదలకు కష్టాలు పడుతున్న ఈ సినిమాను తమిళంలో.. హిందీలో రిలీజ్ చేసే పరిస్థితి ఉందా అన్నది డౌట్.