'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో డైరక్టరుగా పరిచయం అయ్యాడు నాగ్ అశ్విన్. ఆ తరువాత మనోడు ఇంతవరకు తన రెండో సినిమా చేయలేదు. ఇంతలో నిర్మాత అశ్వినీ దత్ కూతురుని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇప్పుడు అలనాటి మేటి కథానాయకి సావిత్రి కథతో ఒక సినిమా తీయడానికి శ్రీకారం చుడుతున్నాడు. ఈ బయోపిక్ లో మరి సావిత్రి పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుంది?
ప్రస్తుతానికైతే.. సావిత్రి నాజూకుగా ఉండే హీరోయిన్ కాదు కాబట్టి.. ఆమెలా కాస్త బొద్దుగా కనిపించే భామనే సెలక్ట్ చేయాలంటే.. ఖచ్చితంగా అనుష్క పేరే ఎవరైనా సజెస్ట్ చేస్తారు. అలాగే ఇతర హీరోయిన్లను కూడా సజెస్ట్ చేయొచ్చు. సజెషన్ ఏముంది.. ఎవరికి నచ్చిన పేరును వారు చెప్పేయడమేగా. కాకపోతే సావిత్రి టైపులో మేటి నటన.. అలవోకగా ఎటువంటి హావభావాలైనా పండించే టాలెంట్.. అలాగే ఆమెలా గుర్రపు స్వారీ చేయడం.. (సినిమాల్లో కాదు.. ఆమె రియల్ లైఫ్ లో హార్స్ రైడర్).. అవన్నీ రావాలి. అందుకే ఇప్పుడు సావత్రి కోసం ఒక నటిని ఎంచుకోవడానికి దర్శకుడు ఏం చేస్తున్నాడంటే.. తాను ఆడిషన్ చేసేది బదులు.. ఆన్ లైన్ లో ఒక ఓటింగ్ కాంటెస్ట్ పెడుతున్నాడట. మనమే ఓటేసి సావిత్రి పాత్రకు ఒక హీరోయిన్ ను ఎంపిక చేయాలట.
బాగానే ఉందిలే కాని.. కనీసం సావిత్రిపై తీసే నిజజీవితపు కథలోనైనా ఒక తెలుగమ్మాయిని ఆ పాత్రలో పెడతారా? లేకపోతే మనకు నటన ఇంపార్టెంట్.. ఏ హీరోయినైనా పర్లేదు అంటారా? చూద్దాం.