విమర్శకులను అణచివేసిన స్టార్ హీరో
అలాగే సాధారణ ప్రజలు ఈ సినిమాలకు ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారో కూడా వీడియో స్టోరీలను టెలీకాస్ట్ చేస్తుంటారు.
సాధారణంగా సినిమా సమీక్షకులు తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొడుతూ ఆశ్చర్యపరుస్తుంటారు. యూట్యూబర్లు, ప్రభావశీలురు స్వేచ్ఛగా సినిమాలను విమర్శిస్తుంటారు. అన్ని సినీపరిశ్రమల్లోను ఇది ఉన్నదే. తాము చూసిన సినిమా ఎలా ఉందో తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పే హక్కు విమర్శకులకు ఉంటుంది. అలాగే సాధారణ ప్రజలు ఈ సినిమాలకు ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారో కూడా వీడియో స్టోరీలను టెలీకాస్ట్ చేస్తుంటారు. దీనిని మీడియా స్వేచ్ఛ అంటారు. అయితే మీడియా స్వేచ్ఛను అణచివేసేందుకు చాలా మంది రాజకీయ నాయకులు ప్రయత్నించినట్టే ఇటీవల సినీపరిశ్రమల్లో కొందరు హీరోలు, సినీనిర్మాతలు కంకణం కట్టుకోవడంపైనా చాలా చర్చ సాగుతోంది.
తెలుగు చిత్రసీమలోను సమీక్షకులను కిందికి తొక్కేసేందుకు చాలా కుట్రలు నడిచాయి. కానీ ఏదీ ఎక్కువ కాలం నిలబడలేదు. ఒక పెద్ద నిర్మాత ఫిలింఛాంబర్- నిర్మాతల మండలి తరపున అధికారిక మీడియాలను నడిపించడం ద్వారా, ప్రకటనలు ఇవ్వకుండా అణచివేయడం ద్వారా ఇతర మీడియాలను దెబ్బ కొట్టాలని భావించారు. కానీ అది విజయవంతం కాలేదు. సినిమా జర్నలిస్టులు, క్రిటిక్స్ పై అవమానకరమైన పదజాలం ఉపయోగిస్తూ, ప్రతి దాడి చేసిన కొందరు ఔత్సాహిక నిర్మాతలను మనం ఇటీవల చూస్తున్నాం.
అయితే బాలీవుడ్ లో ప్రముఖ హీరో ఏకంగా తన సినిమా టీజర్ బాలేదని ప్రచారం చేయకూడదని హుంకరించడంపై చర్చ సాగుతోంది. ఇది హై ఆక్టేన్ యాక్షన్ సినిమా. గగుర్పొడిచే థ్రిల్స్ ఉన్నాయి. కానీ ఇది ఆశించినంతగా జనానికి ఎక్కలేదు. ఇందులో స్టార్ హీరో పాత్ర అంతగా బాలేదని కూడా జనం విమర్శిస్తున్నారు.
@pjexplained పేరుతో యూట్యూబర్ సమీక్షలు ఇస్తున్నారు. పెద్ద హీరో టీజర్ పైనా అతడు విమర్శలు గుప్పించారు. ఈ వీడియో వేగంగా వెబ్ లో వైరల్ అయింది. కానీ ఆ తర్వాత ఆ వీడియో యూట్యూబ్ నుంచి మాయమైంది. కాపీ రైట్ హక్కుల కేసు నమోదైంది. అలాగే ఆ యూట్యూబర్‌కి వార్నింగులు ఇచ్చారు. కారణం ఏదైనా కానీ మీడియా స్వేచ్ఛను స్టార్ పవర్, ఆర్థిక- అధికార బలాలు అణచివేస్తాయని ప్రూవ్ అయింది. వినోద పరిశ్రమ జర్నలిజం కూడా అణచివేతకు మినహాయింపు కాదని ప్రూవ్ అయింది.
ప్రస్తుతం కంటెంట్ సృష్టికర్తలపైనా, భావప్రకటనా స్వేచ్ఛపైనా సెలబ్రిటీ పీఆర్వోల ప్రభావం గురించి చర్చకు దారితీసింది. విమర్శకులు, సమీక్షకులకు ఇక్కడ స్వేచ్ఛ లేదు. నిజాయితీగా విమర్శిస్తే ఎవరూ తట్టుకోలేరని కూడా ప్రూవ్ అయింది. అలాగే ఐకమత్యం లేని, అసోసియేషన్ రూపంలో ఒక్కటి కాలేని యూట్యూబర్లు, ప్రభావశీలురకు జరిగే నష్టాన్ని కూడా ఇది తెలియజేస్తోంది.