NYE 2025 మంచు దుప్ప‌టిలో చిక్కుకున్న‌ స్టార్ ఫ్యామిలీ

చాలామంది దుబాయ్ స‌హా యూర‌ప్ లోని ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో కొత్త‌సంవ‌త్స‌ర వేడుక‌ల్ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు.

Update: 2025-01-04 00:30 GMT

ప్ర‌తి డిసెంబ‌ర్‌లో కొత్త సంవ‌త్స‌ర పార్టీల కోసం సినీతార‌లు విదేశీ విహార యాత్ర‌ల‌కు వెళ్ల‌డం చాలా రొటీన్. ఈసారి కూడా NYE 2025 కోసం బాలీవుడ్ స్టార్లు విదేశాల‌కు క్యూ కట్టారు. చాలామంది దుబాయ్ స‌హా యూర‌ప్ లోని ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో కొత్త‌సంవ‌త్స‌ర వేడుక‌ల్ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. కుటుంబ స‌భ్యులు, స్నేహితులతో పార్టీల్లో ఫుల్‌గా చిల్ అయ్యారు.


ఈసారి బెబో కరీనా కపూర్- పటౌడీ సంస్థాన క‌థానాయ‌కుడు సైఫ్‌ ఖాన్ త‌మ కుటుంబంతో స్విట్జర్లాండ్‌కు వెళ్లారు. స్విట్జ‌ర్లాండ్ లోని అద్భుత‌మైన ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో మంచు కొండ‌ల్లో ఫుల్ గా వెకేష‌న్ ని ఆస్వాధించారు. స్విట్జ‌ర్లాండ్ యాత్ర‌లో విహార‌యాత్ర‌కు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసిన బెబో క‌రీనా క‌పూర్ ఖాన్ చాలా నిరాశ‌ప‌డుతూ వీడ్కోలు ప‌లికింది. ఆపలేము, ఆగలేను... 31-12-2024వ సంవత్సరంలో చివరి కొన్ని సెల్ఫీలు ఇవి.. అంటూ కరీనా షేర్ చేసిన‌ సెల్ఫీలు ఎంతో ఆక‌ట్టుకుంటున్నాయి. కొన్ని ఫోటోల‌లో మంచు దుప్ప‌టితో క‌ప్ప‌బ‌డిన అంద‌మైన ప్ర‌కృతి నిజంగా క‌నువిందు చేస్తోంది. ఈ ఫోటోల‌లో క‌రీనా లుక్ చూశాక అభిమానులు క్వీన్ అంటూ పొగిడేశారు.


పటౌడీ కుటుంబం నుంచి కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, వారి కుమారులు తైమూర్, జెహ్ అంద‌రూ విహార‌యాత్ర‌ను ఆస్వాధిస్తూ క‌నిపించారు. ఇటీవల తన కుమారులు స్కీయింగ్‌లో మంచు కొండ‌ల్లో సాహ‌సాలు చేస్తున్న ఓ ఫోటోని కూడా క‌రీనా షేర్ చేసింది. డిసెంబ‌ర్ 25న‌ క్రిస్మస్ వేడుకల నుండి కొన్ని ఫోటోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. ఈ ఆల్బమ్ లో కుటుంబ స‌భ్యులంతా బహుమతులు ప్ర‌ద‌ర్శించ‌డం, ట్రీట్‌లను ఆస్వాధించడం, క్రిస్మస్ ట్రీ దగ్గర ఫోజులివ్వ‌డం వ‌గైరా ఫోటోలు ఆక‌ట్టుకున్నాయి.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కరీనా కపూర్ ప్ర‌స్తుతం వ‌ర‌స ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లో అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకదానిలో న‌టిస్తుంద‌ని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం జనవరి 2025లో సెట్స్‌పైకి వెళ్లి 2026లో విడుదల కానుంది. సైఫ్ అలీ ఖాన్ `రేస్ 4`లో తన పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు. సిద్ధార్థ్ మల్హోత్రా ఇందులో మ‌రో క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నాడు.



Tags:    

Similar News