ప్రభాస్ కోసం కొత్త లోకాన్ని సృష్టిస్తున్నారు.. అన్నీ వింతలు విశేషాలే..!
సాధారణ కథలతో తెరకెక్కుతున్న సినిమాల్లోని చాలా విషయాలను మనం ఊహించొచ్చు.. కానీ.. సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఊహించడం అసాధ్యం. అది దర్శకుడి ఊహ. ఆయన ఎలాంటి కథను చెప్పాలనుకుంటున్నాడు? ఏ లోకాన్ని ప్రేక్షకుడికి పరిచయం చేయబోతున్నాడు? అందులు పాత్రలు ఎలా ఉంటాయి? అనే విషయాలను అంచనా వేయడం కష్టసాధ్యం. రాబోయే తన సినిమా కూడా అలా ఉంటుందని అంటున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
రెబల్ స్టార్ ప్రభాస్ తో ఈ డైరెక్టర్ ఓ సినిమా రూపొందించనున్న విషయం తెలిసిందే. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ తర్వాత ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దానికి చాలా టైం ఉందని అనుకుంటున్నారు అందరూ. కానీ.. ఆ మాత్రం టైం అయితేనే ఈ సినిమా నిర్మాణం పూర్తవుతుందంటున్నారు దర్శకుడు.
నాగ్ అశ్విన్ నిర్మాణంలో తెరకెక్కించిన ‘జాతి రత్నాలు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ మొదలు పెట్టింది యూనిట్. ఈ సందర్భంగా మాట్లాడిన అశ్విన్.. ప్రభాస్ సినిమాకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు. ఈ సినిమాను గతేడాది జూన్ లోనే ప్రారంభించాలని అనుకున్నప్పటికీ.. కరోనాతోపాటు ప్రీ-ప్రొడక్షన్ వల్ల లేటైందన్నాడు.
అయితే.. తన సినిమా ఎలా ఉండబోతోందో ఆసక్తికరంగా వెల్లడించాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా స్క్రిప్టుతోపాటు మొత్తం కొత్తగానే ఉంటుందని చెప్పాడు. ఉదాహరణకు ఈ సినిమాలో వాడే కార్లు ఎక్కడా ఉండవని, అందుకే వాటిని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నట్టు చెప్పాడు. ఇక, ఈ మూవీలో కనిపించే లొకేషన్లతోపాటు, ప్రతీ విషయం సరికొత్తగా ఉంటుందని తెలిపాడు. మొత్తంగా.. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తానని చెప్పాడు. దీన్నిబట్టి.. ఈ సైన్స్ ఫిక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతోంది. ఈ ఏడాది జూన్లో ఈ మూవీ తొలి షెడ్యూల్ ను ప్రారంభించాలని భావిస్తున్నట్టు చెప్పాడు నాగ్.