ఆ 30 సెక‌న్లు మ‌న్మ‌ధుడిపైనే క‌ళ్ల‌న్నీ

Update: 2015-11-20 05:07 GMT
అక్కినేని మిసైల్ అఖిల్ తెరంగేట్రం జ‌రిగిపోయింది. మొద‌టి సినిమా అఖిల్‌ తోనే త‌న స్టామినా ఎంతో చూపించాడు. అభిమానుల్ని మెప్పించాడు. అయితే అఖిల్ గురించి త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఏమ‌నుకుంటున్నారు? ఈ చిత్రంలో ఓ పాట‌లో 30 సెక‌న్ల పాట‌లో మెరుపులు మెరిపించిన కింగ్ నాగార్జున గురించి కుటుంబ స‌భ్యుల ఫీలింగ్ ఏంటి? అని అడిగితే భ‌లే స‌మాధానాలు వినిపించాయి.

ముఖ్యంగా అక్కినేని అమ‌లని ఇదే ప్ర‌శ్న వేస్తే .. అఖిల్ సినిమా మొత్తం అఖిల్ కోస‌మే చూశాను. కానీ ఆ పాట‌లో 30 సెక‌న్ల పాటు నాగార్జున గురించే చూశాను... అంటూ ట్విస్టిచ్చారు. ఇదే ప్ర‌శ్న‌కు నాగ‌చైత‌న్య సైతం స్పందిస్తూ అఖిల్ మొద‌టి సినిమాతోనే స్టార్ అని నిరూపించుకున్నాడు. డ్యాన్సులు - ఫైట్స్‌ - న‌ట‌న ఎందులోనూ త‌గ్గ‌లేదు. నాలుగైదు సినిమాల అనుభ‌వం ఉన్న హీరోలా న‌టించాడు. ఈ విష‌యంలో మా ఫ్యామిలీ చాలా హ్యాపీ. చివ‌రి నిమిషంలో నాన్న ఓ పాట‌లో మెరుపులా మెరిపించాడు.. అంటూ చెప్పుకొచ్చాడు.

నిజ‌మే అఖిల్ సినిమా ఫ‌లితం ఏదైనా .. ఈ మూవీలో అఖిల్ పెర్ఫామెన్స్‌ ని - చివ‌రిలో నాగార్జున ట్విస్టుని అభిమానులు ఎంతో మెచ్చుకున్నారు. తండ్రి కొడుకులు ఇద్ద‌రూ ప్రేక్ష‌కాభిమానుల మ‌న‌సు దోచార‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ముఖ్యంగా ఆ 30 సెక‌న్ల పాటు అమ్మాయిల క‌ళ్ల‌న్నీ మ‌న్మ‌ధుడిపైనే ఉండి ఉంటాయ‌న్న‌ది ప‌క్కా నిజం.
Tags:    

Similar News