టైం కలిసిరానిదే తప్ప టాలీవుడ్ లో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకోసారి ఫలితం ఇవ్వవు. అలాంటి అనుభవమే తన తొలి సినిమాతో పరిశ్రమలో అడుగు పెడదామన్న సౌజన్య అనే దర్శకురాలికి ఎదురైంది. కొంత కాలం క్రితమే పూర్తి స్క్రిప్ట్ ను సిద్దం చేసుకున్న సౌజన్య హారికా హాసిని సిస్టర్ కన్సర్న్ బ్యానర్ సితార సంస్థలో నిర్మించేలా ఓకే చేయించుకున్నారు. హీరోగా కొన్ని పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ చివరికి చైతు ఈ కథను మెచ్చాడని తెలిసింది. మళ్ళి చూద్దాం అని చెప్పిన చైతు ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇది చేయలేనని నిస్సహాయత వ్యక్తం చేసినట్టు ఫిలిం నగర్ టాక్. నిజంగానే చైతు వరస సినిమాలతో పూర్తిగా లాక్ అయిపోయి ఉన్నాడు. సవ్యసాచి చివరి దశలో ఉండగా మారుతి శైలజా రెడ్డి గారి అల్లుడు కూడా స్వింగ్ లో ఉంది. ఇది కాకుండా తన లైఫ్ పార్టనర్ సమంతాతో పెళ్ళయ్యాక నటించబోయే సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చైతునే చెప్పాడు.
ఈ మూడు కాకుండా మావయ్య వెంకటేష్ తో కలిసి బాబీ దర్శకత్వంలో ఓకే చెప్పిన మల్టీ స్టారర్ కూడా మేలోనే షూటింగ్ ప్రారంభించుకోబోతోంది. మొత్తం నాలుగు సినిమాలకు కమిట్ అయిన యూత్ హీరో చైతు ఒక్కడే అనడంలో అబద్దం లేదు. మరి ఇంత టైట్ షెడ్యూల్ లో సౌజన్య సినిమా చేయాలంటే కనీసం ఏడాదిన్నర పైగా ఆగాల్సి ఉంటుంది. అప్పటి కమిట్మెంట్ ఇప్పుడే ఇవ్వడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. ఇవన్ని ఆలోచించే చైతు డ్రాప్ అయినట్టు సమాచారం. మరి స్క్రిప్ట్ లాక్ చేసుకున్న సితారా సంస్థకు ఇప్పుడు హీరో కావాలి. ఎవరితో చేస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. చలో ఫేం వెంకీ కుడుముల స్క్రిప్ట్ కూడా ఇదే సంస్థలో తెరకెక్కడానికి సిద్ధంగా ఉంది. కథల కొరత ఉంది అని ఒకపక్క హీరోలు చెబుతుంటే చేతిలో కథలున్నా హీరోలు లేక వేచి చూస్తున్న దర్శకులను చూస్తుంటే వింతగా అనిపిస్తోంది కదూ.