మలయాళ ‘ప్రేమమ్’ చూసి మైకంలో పడిపోయారు చాలామంది. ఇప్పుడు ఆ సినిమా తెలుగులో కూడా వచ్చేస్తోంది. మలయాళ సినిమా చూడని వాళ్లు తెలుగు ‘ప్రేమమ్’ మీద ఎలా ఆసక్తితో ఉన్నారో.. ఒరిజినల్ చూసిన వాళ్లు.. తెలుగు వెర్షన్ ఎలా చేశారు.. ఉన్నదున్నట్లుగా తీసేశారా.. మార్పులేమైనా చేశారా.. చేసిన మార్పులు ఎలా ఉన్నాయో చూద్దామని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే తెలుగు ‘ప్రేమమ్’ కాపీ పేస్ట్ కాదని ఆల్రెడీ నాగచైతన్య వెల్లడించాడు. మలయాళ వెర్షన్ పొయెటిక్ వేలో తీశారని.. ఐతే తెలుగు ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్లుగా సినిమాను క్రిస్ప్ గా తయారు చేశామని చైతూ తెలిపాడు.
ఈ సినిమా నిడివి సంగతి చూస్తేనే మలయాళంతో పోలిస్తే తెలుగు వెర్షన్ భిన్నంగా ఉండబోతోందని అర్థమవుతోంది. మలయాళ ‘ప్రేమమ్’ నిడివి 2 గంటల 53 నిమిషాలుంటుంది. కానీ తెలుగు వెర్షన్ ను 2 గంటల 16 నిమిషాలకే కుదించారు. అంటే 17 నిమిషాలు తక్కువన్నమాట. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. మలయాళంలో మూడో లవ్ స్టోరీ చాలా సింపుల్ గా.. చిన్నగా ఉంటుంది. కానీ దాన్ని తెలుగులో పెంచారు. పాటలు కూడా జోడించారు.
మలయాళానికి.. తెలుగుకి ఇక్కడే మేజర్ చేంజ్ కనిపిస్తుందని సమాచారం. ఓవైపు నిడివి తగ్గింది.. మరోవైపు మూడో లవ్ స్టోరీని పెంచారు. మరి ఎలా బ్యాలెన్స్ చేశారు.. ఇంకెక్కడ కోత విధించారు అన్నది ఆసక్తికరం. ఈ సందేహాలకు ఇంకొక్క రోజులో సమాధానం దొరికేస్తుందిలెండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/