బాక్సాఫీసు ముందుకు సోలోగా వస్తేనే సో బెటరు అనేది దర్శకనిర్మాతల అభిప్రాయం. పోటీ లేకుంటే ఎంచక్కా వసూళ్లన్నీ ఒక్క సినిమాకే వస్తాయనేది వాళ్ల నమ్మకం. కానీ ఇంత మంది హీరోలుండగా, ఇన్ని వందల సినిమాలు తెరకెక్కుతున్న పరిస్థితుల్లో సోలో రిలీజ్ లు ఆశించడం కష్టమే మరి. ఒక్కో వారం నాలుగైదు సినిమాలు పోటీ పడుతుంటాయి. కానీ దర్శకనిర్మాతలు కాంప్రమైజ్ అయ్యి ఒకట్రెండు సినిమాల్ని వదులుతూ వుంటారు. అక్కడికి థియేటర్లు దొరకని పరిస్థితి.
అందుకే ఎన్టీఆర్ ఈ గొడవంత ఎందుకని కాంపిటీషన్ పెద్దగా ఉండని ఆగస్టు మాసాన్ని తన సినిమా విడుదలకి ఎంపిక చేసుకున్నాడు. స్టార్ సినిమా ఎప్పుడొచ్చినా తిరుగుండదు కానీ, ఆగస్టు నెలలో బాక్సాఫీసు దగ్గర సందడి ఎక్కువగా ఉండదు. అందుకే అన్నివిధాలా ఆ నెలే కరెక్టని ఆగస్టు 12వ తేదీన తన జనతా గ్యారేజ్ విడుదల అని ప్రకటించాడు ఎన్టీఆర్. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
అయితే ఇంతలో ఎన్టీఆర్ ని ఢీ కొట్టడానికి నాగచైతన్య రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. చైతూ నటిస్తున్న ప్రేమమ్ ని కూడా ఆగస్టు 12నే విడుదల చేయాలని చిత్రబృందం డిసైడయినట్టు సమాచారం. ప్రేమమ్ సమ్మర్ కే వస్తుందని ఊహించారంతా. కానీ అలా జరగలేదు. చిత్రీకరణలో జాప్యం వల్ల విడుదల వానాకాలంకి మారింది. అటు తిరిగి ఇటు తిరిగి ఎన్టీఆర్ సినిమా విడుదలయ్యే తేదీనే ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి మాస్ కంటెంట్ తో వస్తున్న జనతా గ్యారేజ్ ని ఫీల్ గుడ్ ప్రేమమ్ ఎంత వరకు తట్టుకొని నిలబడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిత్రబృందం మాత్రం మాంచి కాన్ఫిడెన్స్ తో కనిపిస్తోంది. ప్రేక్షకులు మాత్రం ఒక క్లాస్ సినిమాతో, మరొక మాస్ సినిమాతో ఎంజాయ్ చేయొచ్చన్నమాట.