మ్యాడీ కోసం అమ్మాయిలు ఫోన్లు!

Update: 2018-10-27 17:22 GMT
యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య గురించి వ్య‌క్తిగ‌తంగా తెలిసిన వాళ్లు ఓ రెండు విష‌యాల్లో అత‌డి సిన్సియారిటీని, వ్య‌క్తిత్వాన్ని అమితంగా ఇష్ట‌ప‌డ‌తారు. అత‌డి నోటి నుంచి ఏనాడూ అన‌వ‌ర‌మైన మాట‌లు వినిపించ‌వు. నిజాయితీలో హార్ట్‌ఫుల్‌గా ఉండ‌డంలో నాగ‌చైత‌న్య‌ను కొట్టేవాళ్లే లేరు అనేది అత‌డితో క‌లిసి ప‌నిచేసిన వారు చెప్పే మాట‌. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉండే త‌త్వం చైతూకి ఉంది. అందుకేనేమో.. ఆ మంచి వ‌ల్ల‌నేనేమో దేవ‌ర‌కొండ .. చైతూని తొలిసారి క‌ల‌వ‌గానే వెంట‌నే ఫ్రెండ‌యిపోయాడు.

నేటి `స‌వ్య‌సాచి` వేదిక సాక్షిగా మ‌రోసారి చైతూ ఎంతో నిజాయితీగా మాట్లాడాడు. ఇన్ని సినిమాలు చేశాను. ఏనాడూ లేనిది మ్యాడీ స‌వ్య‌సాచి సెట్స్‌ కి వ‌చ్చారు అన‌గానే అమ్మాయిలు ఫోన్ చేశారు. మ్యాడీని క‌ల‌వొచ్చా అని అడిగారు. అదీ ఆయ‌న క్రేజు... అని పొగిడేశాడు చైతూ. మాధ‌వ‌న్ ఊరికే సినిమాలు అంగీక‌రించ‌రు. క‌థ‌లో ఏదైనా స్పెషాలిటీ ఉండాలి. పాత్ర ప‌రంగా ఇంకేదైనా ఉండాలి. ఉంటేనే అంగీక‌రిస్తారు. త‌న‌ని ఒప్పించినందుకు చందుకి చాలా థాంక్స్`` అని అన్నాడు చైత‌న్య‌.నేను- చందు ఓ సినిమా చేయాల‌నుకున్న‌ప్పుడు.. మైత్రి సంస్థ వ‌చ్చి నెక్ట్స్ లెవల్‌ కి తీసుకెళ్లే చిత్రం చేసింది. నా కెరీర్‌ లోనే బెస్ట్ మూవీ ఇది.. అని అన్నారు.

ఇదే వేదిక‌పై వేరొక విషాద ఘ‌ట‌న‌ను చైతూ గుర్తు చేసుకున్నాడు. ఇవాళ పొద్దున్నే లేచినప్పుడు ఒక బ్యాడ్‌ న్యూస్ విన్నాను. నాన్న‌గారి స్నేహితుడు శివ‌ప్ర‌సాద్ రెడ్డి గారు ఇక లేరు అన్న‌దే ఆ వార్త‌. అక్కినేని ఫ్యామిలీకి, నాన్న గారికి ఎంతో స‌న్నిహితుడాయ‌న‌. ఆయ‌న లేని లోటు తీర్చ‌లేనిది.. అని అన్నారు. ఇక  దేవ‌ర‌కొండ‌ను ఉద్ధేశించి మాట్లాడిన చైతూ ``రౌడీకి థాంక్స్.. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఆ స్టోరి వింటుంటే చాలా బావుంది`` అని అన్నాడు.

అక్కినేని అభిమానులు మా ఫ్యామిలీలో భాగం. తాత‌గారితో జ‌ర్ని చేసి.. నాన్న‌కు, నాకు, అఖిల్‌కి, సుశాంత్, సుమంత్‌కి అంద‌రికీ స‌పోర్ట్ చేశారు. కొన్నిసార్లు మిమ్మ‌ల్ని డిస‌ప్పాయింట్ చేస్తా. కొన్నిసార్లు ఎన‌ర్జీని ఇస్తా. కానీ
అభిమానుల‌కు అభిమానులు మా అక్కినేని అభిమానులు. ప్ర‌తి సినిమాకి ఇక‌పై మిమ్మ‌ల్ని సంతృప్తి ప‌రిచేలా చేస్తాను... అని అన్నారు. చందు ఎంతో శ్ర‌మించాడు. యూనిక్ పాయింట్ కి క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించి స‌వ్య‌సాచి చేశాడు. ప్రేమ‌మ్‌ తో మెప్పించిన‌ట్టే ఈ చిత్రంతో మెప్పిస్తాడు. కీర‌వాణిగారు తాత, నాన్న‌గారితో చేశారు. సాంగ్ ఆఫ్ స‌వ్య‌సాచి రిలీజైన‌ప్పుడు ఈ సినిమాకి సౌండే మారిపోయింది. ద‌టీజ్ కీర‌వాణి.. అంటూ ప్ర‌శంసించారు.
Tags:    

Similar News