'అశ్వథ్థామ' అప్‌ డేట్స్‌ తో వచ్చేస్తున్నారట!

Update: 2019-12-10 14:28 GMT
యంగ్‌ హీరో నాగ శౌర్య కెరీర్‌ ఆరంభం నుండి విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. సక్సెస్‌ ఫ్లాప్‌ లను పట్టించుకోకుండా శౌర్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. 'ఛలో' చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న శౌర్య ఆ తర్వాత నర్తనశాలతో నిరాశ పర్చాడు. మాస్‌ అప్పీల్‌ ఉన్న సినిమాతో రావాలనే ఉద్దేశ్యంతో 'అశ్వథ్థామ' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రంలో భారీ యాక్షన్‌ సీన్స్‌ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కూడా ఉంటుందట.

ఇక ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను చెప్పేందుకు రేపు చిత్ర యూనిట్‌ సభ్యులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం చేయబోతున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు ప్రెస్‌ మీట్‌ కు చిత్ర యూనిట్‌ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. జనవరి 31న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించబోతున్నారట. షూటింగ్‌ ఎక్కడి వరకు వచ్చిందనే విషయాన్ని కూడా తెలియజేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ చిత్రానికి రమణ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ కొడతాననే నమ్మకంతో నాగశౌర్య చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. రేపటి మీడియా సమావేశంలో ఏదైనా ప్రత్యేకంగా వీడియో విడుదల చేయడం లేదంటే సింగిల్‌ విడుదల చేయడం చేస్తారేమో చూడాలి.

Tags:    

Similar News